తుంగతుర్తి ఎమ్మెల్యేను విమర్శిస్తే ఊరుకోం కందుకూరి లక్ష్మయ్య తుంగతుర్తి మీడియా ఇంచార్జ్
తిరుమలగిరి 11 జూన్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తుంగతుర్తి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు రోజురోజుకు పెరుగుతున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉండి కోవర్టు గా బిఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్న వ్యక్తులు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెళ్ ను విమర్శిస్తే తగిన గుణపాఠం చెప్తామని తుంగతుర్తి నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జి కందుకూరి లక్ష్మయ్య హెచ్చరించారు. సోమవారం ఆయన తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ శాలిగౌరారం మండలం లోని వంగమర్తి, ఇటుకుల పాడు మూసి వాగు నుండి ఇసుక ప్రభుత్వం అనుమతితోనే యాదాద్రి ధర్మల్ ప్లాంట్ ఖమ్మం మున్నేరు వాగ్ సేఫ్టీ వాల్ నిర్మాణానికి కావలసిన ఇసుకను తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఇసుక తరలి వెళ్తున్నట్లు స్వయంగా జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన మీడియా ముఖ్యంగా ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడగా వివరణ ఇచ్చారన్నారు. ఎమ్మెల్యే పై దుష్ప్రచారానికి పూనుకున్న వ్యక్తులు వారి విధివిధానాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడం ఎమ్మెల్యే కు ఇష్టం లేదని చెప్పే దద్దమ్మలకు భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే , మందుల సామేలు నాడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే అదనంగా 20 వేల మెజార్టీ దాదాపు 70 వేల పైచిలుక మెజార్టీని తీసుకువచ్చిన ఘనత ఎమ్మెల్యే మందుల సామేలు దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే ఉద్యమకారుడు ,ప్రజా నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉండే ప్రజా నాయకుడిని పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వారికి గుణ పాఠం తప్పదన్నారు