తుంగతుర్తి అభివృద్ధికి సహకరిస్తా మంత్రి కోమటిరెడ్డి

తుంగతుర్తి అభివృద్ధికి సహకరిస్తా.. ఇచ్చిన మాట తప్పను ...
వివిధ బిటి రోడ్లు మంజూరు...
హర్షం వ్యక్తం చేస్తున్న తుంగతుర్తి నియోజకవర్గం ప్రజలు...
తిరుమలగిరి 24 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులకు ప్రతిపాదనలను రాష్ట్ర రోడ్లు మరియు భవనాలకు మరియు సినిమాటో గ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారి మంత్రుల నివాసం వద్ద కలిసి అభివృద్ధి పనులు మంజూరు చేయవలసిందిగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు కోరారు .. అర్వపల్లి మండలంలోని NH -365 నుండి బొల్లంపల్లి గ్రామం వరకు బీటీ రోడ్డు . బీటీ రోడ్డు అడ్డగూడూరు మండలం చౌళ్ళరామారం నుండి జానకిపురం గ్రామం వరకు బీటీ రోడ్ శాలిగౌరారం మండలం రామగిరి గ్రామం నుండి గురుజాల గ్రామం వరకు. తుంగతుర్తి మండల కేంద్రంలో తుంగతుర్తి నూతన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం .మరియు మోత్కూర్ మండలానికి సంబంధించి హై లెవెల్ బ్రిడ్జ్ దాదాపు 300 మీటర్లతో బిక్కేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు. అందించారు వెంటనే స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ అండ్ బి అధికారులకు పంపించి రోడ్లు మంజూరు చేయించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన మాట తప్పను తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరి మండల కేంద్రం లో రేషన్ కార్డు పంపిణీ సభలో మాట ఇచ్చిన తుంగతుర్తి అభివృద్ధికి సహకరిస్తానని మాట తప్పకుండా తుంగతుర్తి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే మందుల సామేల్ మంత్రి వారికి ఘనంగా శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు..దీనితో తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు........