నూతన ఎమ్మెల్సీ గా ఎన్నికైన శంకర్ నాయక్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

తెలంగాణ వార్తమాడుగులపల్లి;29 : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో భాగంగా డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ కు ఎమ్మెల్సీ పదవి దక్కడంతో మాడుగులపల్లి మండలం గజలాపురం గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలుహర్షం వ్యక్తం చేశారు ఈరోజు మిర్యాలగూడ క్యాంపు కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారుఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చిన్న కార్యకర్త నుండి ఎదిగి ఈరోజు ఎమ్మెల్సీ కావడం చాలా సంతోషంగా ఉందనికాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు దక్కుతుందని అనడానికి ఇదే నిదర్శనం అని అన్నారుఎమ్మెల్సీ శంకర్ నాయక్ నీగజలాపురం గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరామన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు బాలి కొండయ్య,సింగం ముత్తయ్య,పొలగాని వెంకటేశ్వర్లు,కుక్కముడి వెంకన్న,మాజీ వార్డ్ నెంబర్ గవ్వ ఉపేందర్ రెడ్డి,మండల నాయకులు జక్క నాగరాజు,ఉబ్బిడి సత్యనారాయణ,యువ నాయకులు అనిల్ రెడ్డి,జక్క నాగయ్య,గ్రామ యూత్ అధ్యక్షులు సింగం కార్తీక్,బట్టు మహేష్ చారి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.