బిఎస్పి ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన నాగర్ కర్నూల్ బిఎస్పి పార్లమెంట్ అభ్యర్థి మంద జగనాథ్

జోగులాంబ గద్వాల్ 18 ఏప్రిల్ 24 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఎర్రవల్లి మాయావతి ఆధ్వర్యంలో బిఎస్పి పార్టీలో చేరిన తరవాత సొంత గ్రామం కొండేర్ కి వచ్చిన తరవాత బిఎస్పి ముఖ్య కార్యాకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగింది.కార్యాకర్తలు అంత ఏకదీక్షతో బాబా సాహెబ్ అంబేద్కర్, కాన్షి రామ్ ఆశయాలకి అనుకున్నలంగా సమసమాజ నిర్మాణనికి మరియు అని రంగాలలో బహుజన్లు పైకి రావడానికి అంబేద్కర్ చేపినట్టు రాజాధికారమే అంతిమ లక్ష్యం అనే ధృష్టిలో పెట్టుకోని బిఎస్పి నాయకులు కార్యకర్తలు ప్రజల దగరికి వెళ్లి బిఎస్పి ఉదేశ్యలను బహుజనులకు వివరిస్తూ నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం బిఎస్పి గెలిచే విధంగా పని చేయాలి అని కార్యకర్తలకు చెప్పడం జరిగింది. ఈరోజు నుండే కార్యకర్తలు ప్రచారాలు మొదలు పెట్టాలి అని విజయమే అంతిమ లక్ష్యం గా నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ Mg కృష్ణ,గద్వాల్ జిల్లా ఆకేపోగు రాంబాబు, జిల్లా ఆర్గనైజార్ రేపల్లి రాజు, గద్వాల్ ఇంచార్జ్ సునంద,యేసు రాజు, గద్వాల్ ఉప సవరన్న, గద్వాల్ కోశాధికారి అకేపోగు వెంకట్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.