కొల్లాపూర్ మున్సిపాలిటి లో నేడు నూతన లైట్స్ వేయడం జరిగింది
అట్టి పనులను పరిశీలించిన చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు
గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు గారి నిధుల నుండి కొల్లాపూర్ మున్సిపాలిటి కి 10,00000 పది లక్షల రూపాయలు నూతన లైట్స్ కోసం నిధులు ఇవ్వడం జరిగింది, కొల్లాపూర్ లో పర్యాటక రంగంలో అభివృద్ధి చెందుతున్న సోమశిలకు వెళ్లే మార్గంలో వరిదేల చెరువు కట్టమీద చీకటిగా ఉండడంతో మంత్రివర్యులు గారి దృష్టికి ఇట్టి విషయాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ మరియు కౌన్సిలర్లు తెలియజేయడం జరిగింది..
ఇట్టి విషయం పై స్పందించిన మంత్రి గారు సంబందించిన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు, స్పందించిన అధికారులు వరిదేల చెరువు కట్ట మీద నూతనంగా స్ట్రీట్ లైట్స్ కోసం పోల్స్ ఏర్పాటు చేశారు..
నేడు అట్టి పోల్స్ కు లైట్స్ ను బిగించారు, మరియు గెస్ట్ హౌస్ నుండి పెంట్లవెళ్ళి రోడ్ లో నూతనంగా లైట్స్ వేయించారు, మరియు ఎంపీడీఓ ఆఫీస్ నుండి మాధవ స్వామి దేవాలయం వరకు నూతన లైట్స్ వేయడం జరిగింది, అదే విదంగా మున్సిపాలిటి లో ప్రధాన ముఖ్య కూడలిలో కొత్త లైట్స్ వేయడం జరిగింది..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు గారు, కౌన్సిలర్లు షేక్.రహీం పాష గారు, మేకల శిరీష కిరణ్ యాదవ్ గారు, అబ్దుల్ నయుమ్ గారు, ఎల్లగౌడ్ గారు, రెడ్డి సత్యం గారు, జ్యోతి శేఖర్ గారు, మున్సిపాలిటీ ఏ ఈ హేమలత గారు, మన్నెం గారు మున్సిపాలిటీ ఎలక్ట్రికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..