తిక మక పెడుతున్న సూచిక బోర్డులు
తిరుమలగిరి 31 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల పరిధిలోని జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ఊరు సూచికలు వాహనదారులను అయోమయానికి గురిచేస్తున్నాయి తిరుమలగిరి నుండి తొర్రూరు వెళ్లే మార్గంలో తిరుమలగిరి మాలిపురం దిశలను ఒకే వైపు ఎడమవైపు చూపిస్తూ బోర్డులు వెలిశాయి వాస్తవానికి తిరుమలగిరి కుడివైపున లేదా ముందుకు వెళ్లాల్సి ఉండగా తప్పుడు సూచికలతో కొత్తవారు ఇబ్బందులు పడుతున్నారు అధికారులు ఈ పొరపాట్లను సరిదిద్దాలని స్థానికులు వాహనదారులు కోరుతున్నారు.....