తాడి చెట్టు పై నుంచి క్రింద పడ్డ గీత కార్మికున్నీ ప్రభుత్వం ఆదుకోవాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ తాటి చెట్టు పై నుండి పడిన తండు రాములు అనే గీత కార్మికున్ని ప్రభుత్వం ఆదుకోవాలని కల్లు గీత కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు* ఆత్మకూర్ ఎస్ మండలం పాతర్ల పాడు గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు తండు రాములు వయస్సు (60) సంవత్సరాలు అనే గీత కార్మికుడు ఈరోజు ఆదివారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారీ కింద పడటంవల్ల కుడి తొంటి తొలగినది కుడి భుజం బలంగా తగడం వల్ల కద లేకుండా పోతున్నాడు తలకు బలమైన దెబ్బ తగిలినది కాళ్లకు చేతులకు బలంగా గాయాలు అయినవి నడుముకు గట్టిగా గుద్దుకోవటం వల్ల అటు ఇటు కదలేకపోతున్నాడు. ఏదురొమ్మున గట్టిగా గుద్దుకోవటం వల్ల శ్వాస ఆడటం లేదు వెంటనే 108 ద్వారా సూర్యాపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ తరలించి చికిత్స పొందుతునాడు. గీతా వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న ఇతనికి తక్షణమే ప్రభుత్వం నుండి 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని. బీసీ కార్పొరేషన్ నుండి ఆర్థిక సహాయం 15000 ఇచ్చి పేద గీత కార్మికుని ఆదుకోవాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు సొసైటీ అధ్యక్షులు బత్తుల వెంకన్న డిమాండ్ చేశారు.