భారీ వర్షాలపై అప్రమత్తం కడెం ప్రాజెక్టు ను పరిశీలించిన మంత్రి జూపల్లి
????జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టును ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం సందర్శించారు. ప్రాజెక్టులోకి వస్తున్న వరదనీటి ఇన్ఫ్లో, అవుట్‌ఫ్లోపై ఇంజనీరింగ్ అధికారుల నుంచి వివరాలు సేకరించారు.
????ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రాజెక్టు వద్ద ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ఇప్పటికే 9 కోట్ల రూపాయల నిధులతో మరమ్మతు పనులు పూర్తిచేశామని వెల్లడించారు. వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు, గ్రామాల్లో రహదారులు దెబ్బతిన్నాయని, రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. భారీ వరదల కారణంగా పంట పొలాలు, నివాస గృహాలు, రహదారులు నష్టపోయాయని మంత్రి పేర్కొన్నారు. వర్షాలు తగ్గిన అనంతరం సంబంధిత శాఖలు సర్వే చేసి, నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదిక పంపుతాయని, అనంతరం బాధితులకు ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.
????వరద నీటిలో కొట్టుకుపోయిన ఒక మత్స్యకారుని కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మంత్రి అన్నారు. కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధిపై దృష్టి పెట్టి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు చేపడతామని వెల్లడించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు సమాచారం అందించాలని, అవసరమైన సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వాగులు, నదులు, ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
????ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఎమ్మెల్సి దండేవిట్టల్,_
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, అదనపు కలెక్టర్లు పైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నాకళ్యాణి, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
[7:28 pm, 19/8/2025] Giribabu Ceo Jogulamba Tv: PRESS MEET
సోలాపూర్ నుండి గంజాయి ని తీసుక వచ్చి గద్వాల్, ఐజ పట్టణాలలో యువతకు అమ్ముతున్న నిందితులను అరెస్ట్ చేసిన గద్వాల్ పోలీసులు.
నిందితుల నుండి 1.6 KG ల గంజాయి, 3 మొబైల్ ఫోన్ లు స్వాధీనం
మహారాష్ట్ర సోలాపూర్ నుండి గంజాయి ని కొనుగోలు చేసి దానిని చిన్న చిన్న పాకెట్స్ రూపంలో గద్వాల్, ఐజ పట్టణాలలో యువతకు అమ్ముతున్న ముగ్గురు నిందితులను గద్వాల్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుండి 1.6 KG ల గంజాయి, 3 మొబైల్స్ లు స్వాధీనం చేసుకున్నారు.
కేసు వివరాలు:
ఈ రోజు పట్టణ పోలీసులకు నమ్మదగిన సమాచారం రాగా పోలీస్ ఉన్నంతధికారుల ఆదేశాల మేరకు ఉదయం 08:30 గంటల సమయంలో రైల్వే స్టేషన్ నుండి వస్తున్నట్లు నమ్మదగిన సమాచారం రాగ అనుమానస్పదంగా ఉన్న ముగ్గురుని గద్వాల్ పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్ తన సిబ్బంది తో కలిసి అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చెయ్య వారి దగ్గర 1.65 KG ల గంజాయి ను గుర్తించి పట్టణ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 173/2025 గా కేసు నమోదు చెయ్యడం జరిగింది.
.
1.ముద్దాయిల వివరాలు:
A1-భాషా మీయ్య S/o దౌలత్ ఉస్సేన్, వయస్సు: 28 సంవత్సరాలు, కులం: ముస్లిం, Occu: డెకరేషన్ వర్క్ R/o షేరెల్లి వీధి, గద్వాల్ టౌన్.
A2- పూర్ణ అంబదాస్ @ అజయ్ s/o యాదగిరి, వయస్సు:25 సంవత్సరాలు, కులం : కుర్ని, occ: షాప్ కిపర్ r/o ఐ జ
A 3- చాకలి పరుష రాముడు s/o ఈరన్న, వయసు-22 సంవత్సరాలు, occ- మేస్త్రి, R/O ఐజ పట్టణం.
2.నేరము చేసిన విధానము:
స్నేహితులుగా ఉన్న ముగ్గురు గత 6 నెలలుగా వీరు మహారాష్ట్ర సోలాపూర్ నుండి వీరు KG ల రూపకంగా గంజాయి కొనుగోలు చేసి ఇక్కడకు తీసుకవచ్చి వాటిని చిన్న చిన్న పాకెట్స్ రూపంలో గద్వాల్ టౌన్, ఐ జ పట్టణాలలో వారికీ పరిచయం ఉన్న యువతకు, ఇతరులకు అమ్మేవారు. పోలీస్ ల విచారణలో ఇప్పటి వరకు 30 మందికి అమ్మినట్లు పేర్లు వెల్లడించడం జరిగింది. త్వరలో మరింత మంది పేర్లు వచ్చే అవకాశం ఉన్నది.
3.స్వాధీనం పరుచుకున్న వస్తువులు/ సొత్తు.
1) 1.65 KG ల గంజాయి.
2) 3 మొబైల్స్
4.నేరము ను చేదించిన విధానము:
శ్రీ టి. శ్రీనివాస రావు, ఐ పి ఎస్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జోగుళాంబ గద్వాల జిల్లా వారి ఆదేశాల మేరకు శ్రీ వై. మొగిలయ్య డిఎస్పి గద్వాల గారి స్వియ పర్యవేక్షణలో శ్రీ టి. శ్రీను సిఐ గద్వాల్ సూచనలతో పోలీస్ వారికీ వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు గద్వాల్ ఎస్సై కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ బ్రిడ్జి క్రింద తన సిబ్బంది తో నిఘా ఉంచి అనుమానస్పదంగా ఉన్న ముగ్గురిని ఈ రోజు ఉదయం 8:30 గంటల సమయంలో అదుపులోకి తెసుకొని వారి వద్దనుండి గంజాయి ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చెయ్యడం జరిగింది. కేసు పూర్తి విచారణలో వీరు ఇంకా ఎక్కడెక్కడ, ఎవరెవరికి సరఫరా చేశారు వంటి వివరాలు వెల్లడించడం జరుగుతుంది. రోజు సాయంత్రం రిమాండ్ కు తరలించడం జరుగుతుంది. ఈ కేసును ఛేదించడం లో ప్రతిభ చూపిన సిబ్బంది చంద్రయ్య, వీరేష్, కిరణ్ లను డి. ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.
PRO
District Police Office
Jogulamba Gadwal District.