డయల్ - 100 కాల్స్ పట్ల  తక్షణమే స్పందించాలి:జిల్లా ఎస్పీ

Aug 8, 2024 - 20:19
Aug 8, 2024 - 20:24
 0  0
డయల్ - 100 కాల్స్ పట్ల  తక్షణమే స్పందించాలి:జిల్లా ఎస్పీ

జోగులాంబ గద్వాల 8 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల:-ప్రజలు ఆపదలో ఉపయోగించే డయల్ - 100 కాల్స్ పట్ల  తక్షణమే నిర్ణీత సమయంలో స్పందించాలని , ఏలాంటి ఆలస్యం చేయకుండా సిబ్బంది లేదా అధికారులు సంఘటన స్థలానికి చేరి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు పోలీస్ అధికారులను ఆదేశించారు.రాష్ర్ట స్ధాయి పోలీస్ అధికారులతో ఈ నెల 6 వ తేది నాడు  డిజిపి హల్ఫ్ ఇయర్లీ నేర సమీక్ష సమావేశం నిర్వహించి పోలీస్ వ్యవస్థను ప్రజలకు మరింత దగ్గరగా చేర్చి మెరుగైన సేవలను అందించేందుకు ఆయా కమిషనరెట్ ల సీపీలకు , జిల్లాల ఎస్పీ లకు ట్రాఫిక్ నియంత్రణ , డయల్ - 100 కు తక్షణమే స్పందించడం, రౌడీ షీటర్స్ పై నిఘా ఉంచడం, సిబ్బంది సంక్షేమం, పోలీస్ వాహనల నిర్వహణ, ప్రాపర్టీ నేరాల చేధన , నియంత్రణ,ఎన్బి డబ్ల్యూ ఎస్ సర్వ్ చేయడం, అధికారులు, సిబ్బందిని గ్రామాల ప్రజలతో కమ్యూనికేషన్ పెంచుకోవడం వంటి అంశాల పై  సూచనలు చేసిన సందర్బంగా ఈ రోజు జిల్లా ఎస్పీ జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఆయా అంశాలను మరింత మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలను  అధికారులకు వివరించడం జరిగింది.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్  అధికారులు,సిబ్బంది తమ పరిధిలో ఎక్కడ ఏమీ జరిగిన వెంటనే పోలీస్ లకు సమాచారం అందించేలా ప్రజలతో కమ్యూనికేషన్ పెంచుకోవాలని తద్వారా  నేరాలను ముందే అంచనా వేసి నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.  పబ్లిక్ కు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ విజిబుల్ పొలిసింగ్ ను మరింత పెంచాలని, లా & ఆర్డర్ కు సంబంధించిన ప్రతి అంశాన్ని ముందుగానే అంచనా వేయగలగాలి అని సూచించారు. జిల్లా లో ట్రాఫిక్ ను ఇంకా క్రమబద్ధీకరణ చెయ్యాలని, జిల్లా లో అవసరమైనా చోట ట్రాఫిక్ జంక్షన్ ల ఏర్పాటు ప్రదేశాలను గుర్తించాలని,ఎర్రవల్లి చౌరస్తాలో ఐకాన్ ట్రాఫిక్ జంక్షన్ ను ఏర్పాటు చెయ్యాలని అందుకు అవసరమైన బారికేడ్స్, డివైడర్స్, సిగ్నలింగ్ ,ఇతర ఏర్పాట్లు చెయ్యాలని ట్రాఫిక్ ఎస్సై నీ ఆదేశించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి పిర్యాదు దారుని తో రిసెప్షనిస్ట్,అధికారులు గౌరవం తో మెలగాలని, వారితో పోలైట్  గా మాట్లాడుతూ వారి సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం కలిగించాలని అన్నారు. సిబ్బంది కూడా ట్రాఫిక్ రూల్స్ ను తప్పని సరి ఫాలో అయ్యేటట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు ఆపద సమయంలో ఉపయోగించే డయల్ - 100 కాల్స్ పై ఎలాంటి అలసత్వం చూపొద్దని నిర్ణీత సమయంలో బ్లూ కోల్ట్స్/ పెట్రో కార్స్ సిబ్బంది అక్కడకు చేరుకొని సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.  తమ పరిధిలో ఉన్నా రౌడీ షీటర్ ల పై నిరంతర నిఘా ఉండాలని, ప్రస్తుత వారు ఏమీ చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు వంటి విషయాలను అప్డేట్ చేసుకుంటూ ఉండాలని, సమస్యలనూ సృష్టించే  ట్రబుల్ మంగర్స్ ను గుర్తించి వారి పై రౌడీ షీట్ ఓపెన్ చేయుటకు ప్రపోజల్ పంపాలని అన్నారు. 
పోలీస్ అధికారులకు,సిబ్బంది కి కేటాయించిన వాహనాల నిర్వహణ పకడ్బందీ గా ఉండాలని, వాహనాల నిర్వహణ గురించి ప్రతి నెల తనిఖీలు చేపట్టి నిర్వహణ తీరు పై రిపోర్ట్ ఇవ్వాలని ఎం టి ఓ   అధికారికి సూచించారు. ప్రాపర్టీ నేరాల జరగకుండా రాత్రి సమయాలలో విజిబుల్ పోలీసింగ్ ను పెంచాలని, ప్రాపర్టీ నేరాలు జరుగాకుండ నిఘా ఉంచాలని, ఇదివరకే జరిగిన మిగిలి ఉన్న నేరాలను త్వరగా చేదించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్ బి డబ్ల్యూ ఎస్ వారెంట్ లు పెండింగ్ లేకుండా ఎక్సీక్యూట్ చెయ్యాలని,  రోజు వాహన తనిఖీలు చేపట్టి ఈ చాలన్స్ కేసులు నమోదు చెయ్యాలని,యూఐ కేసుల ను పెండింగ్ లేకుండ త్వరగ విచారణ చేపట్టి కోర్టు లో చార్జీ షీట్ దాఖలు చెయ్యాలని ఆదేశించారు. అధికారులు,సిబ్బంది క్రమశిక్షణతో మెలగలి అనీ, పోలీస్ ఇమేజ్ ను తగ్గించే ఏలాంటి చర్యలకు పాల్పడిన క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని , బాధ్యతగా విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందేల మెలగాలని ఎస్పీ అధికారులకు సూచించారు.ఈ సమీక్షలో డి. ఎస్పీ సత్యనారాయణ, ఎస్బి ఇన్స్పెక్టర్ జమ్ములప్ప, గద్వాల్, ఆలంపూర్, శాంతీనగర్ సిఐ లు బీమ్ కుమార్, రవి బాబు, టాటా బాబు, జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్సై లు, ట్రాపిక్, ఐటీ విభాగాల ఎస్సైలు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State