అలంపూర్ సబ్ -డివిజన్ విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి....

Feb 20, 2024 - 18:12
Feb 21, 2024 - 18:48
 0  36
అలంపూర్ సబ్ -డివిజన్ విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి....

జోగులాంబ గద్వాల 20 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- అలంపూర్. నాణ్యమైన మరియు నిరంతరాయ విద్యుత్ సరఫరా కొనసాగింపు కొరకు తేదీ 21.02. 2024 బుధవారం నాడు ఉదయం 8:00 గంటల నుండి 11:00 గంటల వరకు 33KV శాంతినగర్-1 ఫీడర్ లో లైన్లకు తాకే చెట్ల కొమ్మలు తొలగించే కార్యక్రమం తో పాటు అలంపూర్ సబ్ -డివిజన్ పరిధిలోని శాంతినగర్ సెక్షన్, ఉండవెల్లి సెక్షన్, ఎర్రవల్లి సెక్షన్ మరియు మానోపాడ్ సెక్షన్ల పరిధిలోని వివిధ 33/11KV సబ్ -స్టేషన్ లైన రామాపురం, ఉండవెల్లి, మారమునగాల, అలంపూర్ చౌరస్తా, బీచుపల్లి, కోదండాపూర్, ఇటిక్యాల, చాగపూర్, సాతర్ల, శాసనూలు, ఆర్. గార్లపాడు మరియు జల్లాపూర్ విద్యుత్ సబ్ -స్టేషన్లు మరియు ఆయా 11KV ఫీడర్లలో మెయింటైనెన్స్ పనులు (పనిచేయనటువంటి విద్యుత్ సామాగ్రి మార్చుట)  చేయటం జరుగుతుంది. కావున పైన తెల్పిన ఆయా సబ్ -స్టేషన్ ల పరిధిలో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలియజేస్తున్నాం. కావున  వినియోగదారులు అందరూ సహకరించగలరు. విద్యుత్ శాఖ, అలంపూర్ సబ్ -డివిజన్, వారు తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333