రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ను సందర్శించిన

రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్ డి ఎస్) ను మాజీ మంత్రులు,మాజీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ తో కలిసి,సందర్శించిన గద్వాల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి

Jul 8, 2026 - 16:27
Jul 8, 2026 - 16:54
 0  14

జోగులాంబ గద్వాల 8 జూలై 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఈరోజు కర్ణాటక రాష్ట్రంలోని మాన్వి మండల పరిధిలోని రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (RDS) వద్ద కర్ణాటక,ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నిర్మాణం చేస్తున్న ప్రాజెక్ట్ లను మాజీ మంత్రివర్యులు డా.శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రాంరెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల బృందంతో కలిసి, బాసు హనుమంతు నాయుడు  క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలు  నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను ఆపాలని,లేకుంటే ప్రాజెక్టులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు....

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State