పట్టదారులతో సందడిగా మారిన గద్వాల తహసీల్దార్ కార్యాలయం.
జోగులాంబ గద్వాల 8 జూలై 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలం, గద్వాల గ్రామ శివారు సర్వే నంబర్లు 968, 969, 979, 980, 983, 984 మరియు 985లలో 2013సంవత్సరంలో 80 చదరపు గజాల ఇంటి స్థల పట్టాలు అందించగా, అట్టి స్థలాలో ప్రభుత్వ అవసరాల నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం రెండు పడక గదుల ఇండ్లు, నర్సింగ్ కళాశాల, ఇతర ప్రభుత్వ భవనాలను నిర్మించింది. పట్టాలు పొందిన లబ్దిదారులకు డబుల్ బెడ్రూం కేటాయించాలని హైకోర్టు ఆదేశించడంతో పట్టా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ గురువారం గద్వాల తహసీల్దార్ కార్యాలయంలో ప్రారంభించడంతో పట్టదారులతో సందడిగా మారింది.