అమరవీరుల యాదిలో జిఎంపిఎస్ రాష్ట్ర స్ఫూర్తియాత్రను జయప్రదం చేయండి.
ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్
సూర్యాపేట: గొర్రెల,మేకల పెంపకం దారుల సంఘం ఏర్పడి 30 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అమరవీరుల యాదిలో రాష్ట్ర స్ఫూర్తి యాత్ర ఈనెల9, 10 తేదీలలో సూర్యాపేట సూర్యాపేట జిల్లాలో జరుగుతుందని ఈ యాత్రను గొర్రెల, మేకల పెంపకం దారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ లో ఈ నెల 9, 10 తేదీలలో సూర్యాపేట జిల్లాలో జరిగే అమరవీరుల స్ఫూర్తి యాత్ర కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల, మేకల పెంపకం దారుల సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు నిర్వహించిన చరిత్ర జిఎంపిఎస్ కు ఉందన్నారు. సంఘం పోరాట ఫలితంగా 559,1016 వంటి జీవోలు సాధించుకోవడం జరిగిందన్నారు. ఈ 30 ఏళ్ల ప్రస్థానంలో గొర్రెల కాపరుల హక్కుల కోసం పోరాడిన అమరులైన 8 మంది అమరవీరుల కుటుంబాలను పరామర్శించడం అభినందనీయం అన్నారు. గొర్రెల కాపరులకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలన్నారు. ప్రమాదం వల్ల చనిపోయిన గొర్రెల కాపరుల కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఎక్స్రేసియా చెల్లించాలన్నారు. ఎండకు ఎండి, వానకు తడిసి పుట్టల్లో, గుట్టల్లో పడుకుంటూ ప్రమాదాలకు గురవుతున్న గొర్రెల కాపరుల బతుకులు ఘోరంగా ఉన్నాయన్నారు. మూగజీవాలకు మందల వద్దని వైద్యం అందించాలన్నారు. పాలకులు ఎందరో మారిన గొర్రెల, మేకల పెంపకం దారుల బ్రతుకులు మాత్రం మారలేదన్నారు. తమ హక్కుల సాధన కోసం గొర్రెల మేకల పెంపకం దారులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం మాజీ జిల్లా నాయకులు మట్టిపెల్లి సైదులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం మాజీ జిల్లా నాయకులు వజ్జా వీరయ్య యాదవ్, జి ఎం పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల రమేష్, యాదవ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షులు బయ్య మల్లికార్జున యాదవ్, టాఫ్రా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నె యాదగిరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పులుసు సత్యం, జిఎంపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కంచు గట్ల శ్రీనివాస్, రజిక సంఘం జిల్లా నాయకులు కూసు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.