ప్రభుత్వ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి. CPM డిమాండ్

Jul 8, 2026 - 17:00
Jul 8, 2026 - 17:05
 0  5
ప్రభుత్వ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి. CPM డిమాండ్

జోగులాంబ గద్వాల 8 జూలై 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ప్రభుత్వ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఉప్పేర్ నరసింహ డిమాండ్ చేశారు. బుధవారం ధరూరు మండల కేంద్రంలోని బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను, కేజీబీవీ పాఠశాలను, గుడ్డెం దొడ్డిలోని ఎస్సీ గురుకుల పాఠశాల కళాశాల రెసిడెన్షియల్ ను బీసీ బాలుర వసతి గృహాలను సందర్శించి అనంతరం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   గుడ్డెందొడ్డిలో ఉన్న ఎస్సీ గురుకుల బాలికల పాఠశాల కళాశాల రెసిడెన్షియల్ కు  సొంత భవనం లేక ప్రస్తుతం నీటిపారుదల శాఖ భవనంలో ఉన్నదని తెలిపారు .విద్యార్థులకు ఇప్పటివరకు యూనిఫార్మ్స్ , నోట్ బుక్స్ అందలేదని తమ అధ్యయనంలో తెలియదన్నారు. సొంత భవనం లేకపోవడం వల్ల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వాష్ రూమ్లు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురి అవుతున్నారని, ప్రస్తుతం ఉన్న గురుకులానికి రవాణా సౌకర్యం అందుబాటులో లేకపోవడం వల్ల, విద్యార్థులను కలవడానికి వచ్చే తల్లిదండ్రులు  ఇబ్బందులకు గురి అవుతున్నట్లు తెలిపారు.

 మండల కేంద్రంలోని కేజీబీవీ లో అదనపు గదుల కొరత వల్ల విద్యార్థినిలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. విద్యార్థినులకు ఇంకా యూనిఫామ్ అందలేదని,గత సంవత్సరం విద్యార్థులకు రావాల్సిన కాస్మొటిక్ ఛార్జీలు అందరికీ పూర్తిగా అందలేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. అదనపు గదుల నిర్మాణాన్ని వేగవంతం చేసి అందుబాటులోకి తీసుకువస్తే ప్రవేశాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇంటర్ లో MLT ,బైపీసీ కోర్సులు మాత్రమే ఉన్నాయని, పూర్తి స్థాయి సిబ్బందిని నియమించి అన్ని రకాల కోర్సులు ప్రవేశపెడితే విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఒకేషనల్ ఆర్ట్ క్రాఫ్ట్ పోస్ట్ ఖాళీగా ఉన్నదని తమ దృష్టికి వచ్చిందన్నారు. 505 మంది విద్యార్థినిలు ఉన్న మండల కేంద్రంలోని బీసీ మహిళ డిగ్రీ కళాశాల వసతి గృహానికి సొంత భవనం లేకపోవడం ఇబ్బందిగా ఉందన్నారు. ప్రయోగాలకు అవసరమైన ల్యాబ్ సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థునిలు ఇతర కళాశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జనరల్ వసతి గృహ విద్యార్థులకు ఆన్లైన్ ప్రవేశాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిపిఎం ధరూర్ మండల కార్యదర్శి దేవదాస్, నాయకులు హమాలీ నరసింహులు, ఆంజనేయులు, తిమ్మప్ప ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State