ఆలయ బ్రహ్మోత్సవాలకు విరాళం అందించిన ఎమ్మెల్యే

తిరుమలగిరి 13 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం గుండె పూరి గ్రామంలో ఈనెల 21 నుండి 23 వరకు జరిగే శ్రీ పార్వతీ సమత రామలింగేశ్వర స్వామి ఆలయ ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ను ఆహ్వానించగా ఈ మేరకు ఆలయ బ్రహ్మో వత్సవాల కోసం 25 వేల రూపాయల ను విరాళంగా ఆ గ్రామం మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ తిరుమలగిరి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జుమ్మి లాల్ నాయక్ బృందానికి అందజేశారు. గుండెపూరి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ శిఖర నవగ్రహ ధ్వజ స్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. మేరకు హైదరాబాదులో ఎమ్మెల్యే నివాసంలో ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు రామరాజు శరత్ బాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు బొడ్డు బాలకృష్ణ, యూత్ మండల అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్, కొమ్ము సోమన్న, పోలేపల్లి సోమయ్య, బొడ్డు నరేష్, గూడూరు నాగయ్య, పాక మల్లేష్, బలిక నగేష్, బలికా సత్తయ్య, నమల రంజిత్, కొమ్ము పరుశురాం, కొమ్ము సురేష్, పాలకుర్తి పవన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.