ఎస్సీ కమ్యూనిటీ అంబేద్కర్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని తాసిల్దార్ కి వినతి.....

Mar 16, 2024 - 21:00
 0  2
ఎస్సీ కమ్యూనిటీ అంబేద్కర్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని తాసిల్దార్ కి వినతి.....
మునగాల తాసిల్దార్ కి వినతి పత్రం అందజేస్తున్న అంబేద్కర్ సేవా సమితి సభ్యులు

మునగాల 17 మార్చి 2024

 తెలంగాణ వార్త ప్రతినిధి :-

 మునగాల మండల కేంద్రంలో ఎస్సీలకు సంబంధించిన అంబేద్కర్ భవనం ఎస్సీ కమ్యూనిటీ హాల్ నేషనల్ హైవే విస్తరణలో కోల్పోయిన భవనాలు నిర్మించడానికి సరైన స్థలం లేక నేటికీ ఆ భవన నిర్మాణాలు జరగలేదు, అని మునగాల గ్రామానికి చెందిన అంబేద్కర్ సేవా సమితి సభ్యులు శనివారం నాడు మునగాల తాసిల్దార్ కు నేషనల్ హైవే పక్కన ఉన్న విద్యుత్ ఉపకేంద్రం ఎదురుగా ఉన్న పాత ఎమ్మార్వో కార్యాలయం ఖాళీ స్థలం మరియు లిఫ్ట్ ఇరిగేషన్ గోడౌన్ ఖాళ స్థలాలు నిరుపయోగంగా ఉన్నందున వెంటనే ఆ స్థలాలను ఈ భవన నిర్మాణాలకు కేటాయించాలని మునగాల తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎల్పి రామయ్య,ఎల్ నాగబాబు,ఎల్ రాజేష్,గట్టు గురుమూర్తి యాతాకుల శ్రీకాంత్,వై రవి,ఎల్ ఈదయ్య,ఎల్ చిన్న,సోంపంగు లింగయ్య, బండారు సుధాకర్,ఎల్ నవీన్, జి సందీప్, తదితరులు పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State