సూర్యాపేట ఒకటవ పట్టణ పోలీస్ బాలికలు ధైర్యంగా ఉండాలి

Sep 19, 2025 - 19:38
 0  5
సూర్యాపేట ఒకటవ పట్టణ పోలీస్  బాలికలు ధైర్యంగా ఉండాలి
సూర్యాపేట ఒకటవ పట్టణ పోలీస్  బాలికలు ధైర్యంగా ఉండాలి
సూర్యాపేట ఒకటవ పట్టణ పోలీస్  బాలికలు ధైర్యంగా ఉండాలి

సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య

జిల్లా ఎస్పీ నర్సింహ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణ పోలీసులు ఇన్స్పెక్టర్ వెంకటయ్య ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో గల ఎస్సీ బాలికల వసతి గృహం జూనియర్ కళాశాల నందు విద్యార్థులకు భద్రత మహిళా రక్షణ చట్టాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. జిల్లా పోలీస్ శాఖ షీ టీమ్స్ ఆధ్వర్యంలో మహిళల భద్రతకు మరింత రక్షణ కల్పిస్తుందని విద్యార్థినులు ఒకరి పట్ల ఒకరు సత్ప్రవర్తనతో కలిగి కలిసిమెలిసి ఉండాలని సూచించారు. చదువుల పట్ల శ్రద్ధ వహించి పోటీ తత్వంతో చదువుకోవాలని తల్లిదండ్రులకు విద్యాలయానికి మంచి పేరు తేవాలని ఆశించారు. సైబర్ మోసాలు యాంటీ ర్యాగింగ్ మాదకద్రవ్యాల గురించి వివరించి వీటిని నిర్మూలనలో విద్యార్థినులు ప్రధాన భూమిక పోషించాలని, టెక్నాలజీని అభివృద్ధి కొరకు వాడాలి అని తెలియజేశారు.ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను, మహిళలను వేధింపులకు గురి చేస్తే సూర్యాపేట షీ టీం ఫోన్ నెంబర్ 8712686056 కి సమాచారం ఇవ్వండి మీయొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు.

ఈ కార్యక్రమం నందు ఎస్సైలు ఏడుకొండలు పిసి రమేష్ హాస్టల్ వార్డెన్ వాణిజ్యోష్ణ ఉన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333