జిల్లా పోలీస్ కార్యాలయం లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Jan 26, 2025 - 21:33
Jan 26, 2025 - 21:35
 0  14
జిల్లా పోలీస్ కార్యాలయం లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
జిల్లా పోలీస్ కార్యాలయం లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

 జిల్లా ప్రజలు హర్షించేలా పోలీస్ విధులు నిర్వహించాలి.

--------- జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్.

జోగులాంబ గద్వాల 26 జనవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:-

గద్వాల. జిల్లా కేంద్రంలోని
76 వ గణతంత్ర దినోత్సవాన్ని  పురస్కరించుకుని జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్  జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఉదయం జాతీయ జెండాను ఆవిష్కరించి, సిబ్బందికి, జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
 ఈ సందర్భంగా ఎస్పీ  పోలీస్ అధికారులకు, సిబ్బందికి, జిల్లా ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడుతూ ---- ఏ స్ఫూర్తి తో అయితే మహనీయులు రాజ్యాంగాన్ని నిర్మించారో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మనమందరం చట్ట పరిధిలో పోలీస్ విధులు నిర్వహించాలని అన్నారు . మన రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తితో ఈరోజు దేశం అభివృద్ధి పథంలో నడుస్తూ ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాం  అని ,  భారత రాజ్యాంగం  స్వేచ్ఛ, ప్రజాస్వామ్య సౌభ్రాతృత్వం, దేశభక్తి ఆకాంక్షలను,  న్యాయం, స్వేచ్ఛ సమానత్వం మరియు సౌభ్రాతృత్వ  సూత్రాలకు  సజీవ సాక్షి గా ఉంటూ బావి తరాలకు స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు.
కులమత లింగ బేధాలు లేకుండా ప్రతి పౌరునికి సమాన హక్కులు అవకాశాలు ఉండేలాగా సమాజాన్ని నిర్దేశించిన రోజు అని ,ఎందరో త్యాగధనుల ఫలితం గణతంత్ర దినోత్సవం, వారిని ఎప్పుడూ మనం స్మరిస్తూ ఉండాలి, వారి త్యాగఫలం , ప్రాణాలను త్యాగం చేయడం ద్వారా మనం ఈరోజు స్వేచ్ఛ స్వతంత్రంగా జీవిస్తున్నామని తెలిపారు. మన రాజ్యాంగాన్ని ఆమోదించిన ఏడు దశాబ్దాలలో భారతదేశం అన్ని రంగాల్లో ఘనంగా ప్రగతి సాధించిందని ,ఆర్థిక వృద్ధి, సాంకేతిక వృద్ధి, సామాజిక పురోగమన మనం చూస్తున్నాం అని అన్నారు.
 అభివృద్ధి ఫలాలు దేశంలోని ప్రతి పౌరునికి చేరేలా చేయడం మన అందరి సమిష్టి బాధ్యత అని,  భారతదేశాన్ని అతి ముఖ్యమైన దేశంగా నిర్మించేందుకు మనమంతా  కృషి చేయలని , మన స్వేచ్ఛతో పాటు భవిష్యత్ తరాలకు సహజ వనరుల సమకూర్చడానికి మనవంతు పాత్ర పోషించాలని అన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ అంకిత భావం తో భాద్యతగా ఉంటూ జిల్లా ప్రజలు హర్షించేల పోలీస్ విధులు ఉండాలనీ అన్నారు . ప్రతి ఒక్కరు తన పని నీ మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్లాలని, ప్రజలు,ప్రభుత్వం పోలీస్ శాఖ నుండి ఆశిస్తున్న అంచనాలను అందుకోవాలని,మన విధులను అంకితభావంతో నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు.

తరవాత 2024 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం  ప్రకటించిన ఉత్కృష్ఠ , అతి ఉత్కృష్టా  సేవ పతకాలలో జిల్లా నుండి  ఎంపిక అయిన 9 మంది అధికారులకు , 2020 సంవత్సరానికి గాను ఆతి ఉత్కృష్ట   సేవ పత కానికి ఎన్నికైన ఇద్దరు అధికారులకు జిల్లా ఎస్పీ గారు పతకాలు అందజేశారు.
 ఉత్త్కృష్ట సేవ పతకాలు అందుకున్న అధికారులు
జి.రవి బాబు సీఐ ఆలంపూర్ 
టి .వెంకట్ రెడ్డి, ARHC-2785
వై. జమ్మన్న,ARHC -2823
ఏ. రేఖ రెడ్డి,PC -1941
ఖలీల్ ARPC -106
జె. చెన్న కేశవులు -PC 601
టి.శ్రీనివాసులు HG -439

 ఆతి ఉత్త్కృష్ట సేవ పతకాలు అందుకున్న అధికారులు
జి. సుంకన్ బాబు HC -95
షేక్ నిజాముద్దీన్ -HG-19
ఏ. లక్ష్మయ్య ASI రిటైర్డ్ 
బి. వెంకట సుబ్బా రెడ్డి ASI 

అనంతరం గత అక్టోబర్ లో పోలీస్ ఫ్లాగ్ డే సందర్బంగా ఆన్లైన్ వ్యాసరచన పోటీలో, ఫోటోగ్రఫీ , షార్ట్ ఫిల్మ్ విభాగాలలో జిల్లా స్థాయి లో మొదటి మూడు స్థానాల్లో నిలచిన హై స్కూల్, కళాశాల విద్యార్థుల కు , పోలీస్ సిబ్బంది, పోటో గ్రాఫర్ లకు, 2024 లో ఉత్తమ సేవలు అందించిన హోమ్ గార్డ్ అధికారులకు ప్రశంస పత్రాలను అందజేశారు. 
వ్యాస రచన -తెలుగు మీడియo
1.కుమారీ కల్పన ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హై స్కూల్ 
2.MD ఫరూక్ నోబెల్ హై స్కూలు 
3. కుమారీ గాయత్రీ ప్రాక్టిసింగ్ హై స్కూల్
ఇంగ్లీష్ మీడియం
1. భవ్య శ్రీ ప్రభుత్వా ప్రాక్టిసింగ్ హై స్కూల్
2. కుమారీ అక్షిత కృష్ణవేణి jr కలశాల 
3. కుమారీ లక్ష్మీ రూప MALD jr కలశాల
డిగ్రీ స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారు 
1.కుమారి నిషా  SVM డిగ్రీ కళాశాల.
2. కుమారీ ఆఫ్రీన్ ప్రభుత్వ నర్సింగ్ కలశాల
3. టి. రాకేశ్ SVM డిగ్రీ కళాశాల.
ఫోటోగ్రఫీ కాంపిటీషన్ 
1. శేషన్న 
2. సోమ శేఖర్ 
3. వెంకటేష్
షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్
1. శేషన్న
2. ఆనంద్ 
పోలీస్ విభాగంలో 
1. మల్లికార్జున్ AR PC -2739
2. బిమేశ్ PC -3087
3. లచ్చన్న PC -966

2024 సంవత్సరం లో ఉత్తమ సేవలకు గానూ ఎస్పీ  చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న హోమ్ గార్డ్ అధికారులు.
M. జనార్ధన్ ఫోటోగ్రాఫర్ HG -1744
విజయ -WHG, 114
వేంకటేశ్వర్ రెడ్డి HG -586
చెన్నయ్య HG -535
జగన్ మోహన్ HG -538
నాగరాజు HG -200
సతీష్ ఔట్ సోర్సింగ్ 
రవి ఔట్ సోర్సింగ్ 

ఈ కార్యక్రమంలో  సాయుధ దళ డి.ఎస్పి నరేందర్ రావు, ఏ. ఓ సతీష్ కుమార్,గద్వాల్ సిఐ టి. శ్రీను, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి , సైబర్ సెక్యూరిటీ సీఐ రాజు,ఆర్ ఐ వెంకటేష్, జిల్లా పోలీస్ కార్యాలయ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది  పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State