జిల్లా గ్రామీణ అధికారి ఆకస్మిక తనిఖీ

Apr 9, 2026 - 17:42
Apr 9, 2026 - 17:43
 0  5
జిల్లా గ్రామీణ అధికారి ఆకస్మిక తనిఖీ

అడ్డగూడూరు 9 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని బొడ్డుగూడెం గ్రామ పంచాయతీని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి బొడ్డుగూడెం  గ్రామపంచాయతీని ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామంలోని జరుగుతున్న ఉపాధి హామీ పనులను తనిఖీ చేశారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి.. ఎన్ ఎంఎం ఎస్ ఆన్లైన్ హాజరు సక్రమంగా జరుగుతుందో లేదో తెలుసుకున్నారు.ప్రతిరోజు ఉదయం 7 గంటలకే పనికి రావాలని, 300 రూపాయలకు పైగా కూలి పడేలా తప్పనిసరిగా నాలుగు గంటల పాటు కొలతల ప్రకారం పనిచేయాలని కోరినారు. విధులు సక్రమంగా నిర్వహిస్తూ.. కూలీలను సక్రమంగా సమన్వయం చేస్తున్నందుకు గాను డిఆర్.డి.ఏ ఫీల్డ్ అసిస్టెంట్ ఉప్పలయ్యను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకరయ్య, ఏపీఓ రవీందర్, టిఏలు అశోక్, వెంకన్న, పంచాయతీ కార్యదర్శి బాలలక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్ ఉప్పలయ్య, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.