నేడు తిరుమలగిరి విద్యుత్ అధికారితో ఫోన్ ఇన్

Jul 10, 2026 - 05:43
Jul 10, 2026 - 13:03
 0  120
నేడు తిరుమలగిరి  విద్యుత్ అధికారితో ఫోన్ ఇన్

తిరుమలగిరి 10 జులై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- తిరుమలగిరి మండల పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా మీ గ్రామంలో విద్యుత్తు తీగలు తెగిపడ్డాయా..? భారీ వానలకు విద్యుత్తు స్తంభాలు వంగి ప్రమాదకరంగా మారాయా? కరెంటు తీగలు చేతికందే ఎత్తులో ప్రమాదం జరిగేలా కిందకు వేలాడుతున్నా.. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడంలేదా? అయితే ఇది మీ కోసమే. విద్యుత్తు సమస్యలు ఏవైనా సరే ఒక్క కాల్‌ చేస్తే పరిష్కరిస్తామని విద్యుత్‌ శాఖ ఏఈ ఐజాక్ భరోసా ఇస్తున్నారు. నేడు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు 98662 29498 నంబర్‌కు ఫోన్‌ చేసి సమస్య చెప్పాలని సూచిస్తున్నారు. ఆ వెంటనే క్షేత్రస్థాయిలోని అధికారులకు ఆ సమస్యను చేరవేస్తారని.. సమస్య పరిష్కారమయ్యే వరకు దాన్ని అనుసరిస్తారని పేర్కొంటున్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి