అనాథలైన చిన్నారులను ఆదుకున్న దాతలు

Jul 9, 2026 - 23:11
Jul 9, 2026 - 23:11
 0  1
అనాథలైన చిన్నారులను ఆదుకున్న దాతలు

- టిబిఈఎస్ఎస్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో రూ. 1,00116 ఆర్థికసాయం
ఆత్మకూర్(ఎస్), జులై 9 (ప్రజా సంగ్రామం): తల్లి, తండ్రిని కొల్పోయి అనాథలైన చిన్నారులను దాతలు తలోచేయి వేసి రూ. 1,00,116 ఆర్థికసాయం చేసి ఆదుకున్నారు. వివరాల ప్రకారం మండల పరిధిలోని కొత్తతండ గ్రామ పంచాయతీకి చెందిన బాణోతు రమేష్ గత రెండు సంవత్సరాల క్రితం గుండెపోటుతో మరణించగా ఇటీవల తల్లి మాధవి ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి పడి గాయాలై చికిత్స పొందుతూ మృతి చెందడంతో బానోతు అభిరాం, అక్షయ్ లు అనాథలయ్యారు. ఈ  చిన్నారులను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సోషల్ మీడియాలో చేసిన పోస్టులకు చలించిన తెలంగాణ బంజార ఎంప్లాయిస్ సేవా సంఘ్ (టిబిఈఎస్ఎస్) జిల్లా శాఖ ఆ చిన్నారులను ఆదుకోవాలని పిలుపునివ్వడంతో సంఘం నాయకులతో పాటు దాతలు స్పందించి విరాళాలను అందజేశారు. ఆ మొత్తాన్ని గురువారం సంఘం జిల్లా గౌరవ సలహాదారులు, తహసీల్దార్ ఆర్ అమీన్ సింగ్, జిల్లా అధ్యక్షులు, మండల విద్యాధికారి పి పాతులోతు ధారాసింగ్  రాథోడ్ లు చిన్నారులు, కుటుంబ సభ్యులకు ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు విరాళం అందజేసిన ప్రతి ఒక్కరికి వారు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు వెన్నెల పాండు నాయక్, బిచ్చు నాయక్, టిబిఈఎస్ఎస్ కోశాధికారి హుస్సేన్ నాయక్, ప్రధానోపాధ్యాయులు గోపగాని సుధాకర్, పాతులోతు రమేష్, పతేపురం లింగయ్య,  గుగులోత్ తావుర్య నాయక్, దారావత్ రవీందర్నాయక్, రవీందర్, రమేష్ నాయక్, రవి నాయక్, నర్సింహ నాయక్, రామోజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333