పప్పు శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన:- * అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు
జోగులాంబ గద్వాల 9 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : అలంపూర్. నియోజకవర్గo ఎర్రవల్లి మండల పరిధిలోని వల్లూరు గ్రామంలో ఏర్పాటుచేసిన పప్పు శనగ కొనుగోలు కేంద్రాన్ని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. ప్రారంభించారు.
ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ,,,,,
రైతులు తాము పండించిన పంటను దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కేంద్రాలను ఏర్పాటు చేసిందని, రైతులు తమ పంటను ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు విక్రయించుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని,రైతు బాగుంటేనే ఊరు, రాష్ట్రం బాగుంటుందని,నియోజకవర్గంలోని పప్పు శనగ రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.