ప్రతి గడప గడపకు సంక్షేమ పథకాలు ఎమ్మెల్యేతోనే సాధ్యం

Jul 10, 2026 - 05:52
Jul 10, 2026 - 12:25
 0  238
ప్రతి గడప గడపకు సంక్షేమ పథకాలు ఎమ్మెల్యేతోనే సాధ్యం

ఎమ్మెల్యే సామేలు రాష్ట్ర షెడ్యూల్‌ కులాల సంక్షేమ కమిటీ సభ్యుడిగా నియామకం కావడం హర్షనీయం 

నాగారం 10 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామేలు తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్‌ కులాల సంక్షేమ కమిటీ సభ్యుడిగా నియామకం కావడం హర్షనీయమని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కన్నెబోయిన వెంకటబిక్షం అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నడు లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి అందే విధంగా ఎమ్మెల్యే మందుల సామెలు కృషి చేస్తున్నారని అన్నారు. నాగారం మండలంలో పోలీస్‌స్టేషన్, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల భవనాల నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయించి శంకుస్థాపన చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతులు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మందుల సామేలు రాష్ట్ర షెడ్యూల్‌ కులాల సంక్షేమ కమిటీ సభ్యులుగా నియమితులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో సర్పంచ్‌లు బుక్క శ్రీను, వంగూరి దామోదర్, నాయకులు బయ్యం వెంకన్న, ఎలమకంటి సోమయ్య, బెల్లి సైదులు, కుమార్‌స్వామి, వల్లాల భాను, హుస్సేన్, పాల్వాయి పరుశరాములు, ఈదుల రమేష్‌చంద్ర, యాకూబ్‌ తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి