రీ సర్వే పనులు వేగవంతంగా చేయాలి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్.
జోగులాంబ గద్వాల 9 జూలై 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : ప్రభుత్వం మొదటి దశలో చేపట్టిన 70 గ్రామాల్లో రీ సర్వే పనులను వేగవంతంగా చేయాలని గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ అన్నారు. గురువారము హైదరాబాద్ నుంచి రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ సర్వే కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. అన్ని జిల్లాల కలెక్టర్లతో అదన కలెక్టరు రెవెన్యూ సంబంధిత అధికారులతో ఈ సర్వే పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. నోటిఫై చేసిన ప్రతి గ్రామంలో గ్రామ సభలను ఆలస్యం చేయకుండా నిర్వహించి వెంటనే ఈ సర్వే పనులను ప్రారంభించాలని సూచించారు. గ్రామసభల నిర్వహణ వాయిదా వేయకుండా ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని స్పష్టంగా తెలియజేశారు. లైసెన్స్ సర్వేర్లతోపాటు రెగ్యులర్ సర్వేలను కూడా వినియోగించుకోవాలని తెలిపారు. రీ సర్వేల్లో లైసెన్స్ సర్వేలతోపాటు రెగ్యులర్ సర్వేలు కూడా పర్యవేక్షించాలని కోరారు సిబ్బందికి సర్వే రూపాయి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని శిక్షణ కి కనీసం ఒక గ్రామం ప్రాక్టికల్ గా సర్వే పూర్తి చేసి తర్వాత శిక్షణ పూర్తయినట్లుగా పరిగణిస్తామని వారు వెల్లడించారు. నవంబర్ నాటికి తొలి దశలో లక్ష్యంగా పెట్టుకొని గ్రామంలో రి సర్వే పూర్తి చేసి మిగిలిన గ్రామాల్లో వచ్చే ఏడాదికి మార్చినాటికి పూర్తిచేసే కార్యచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లాస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ సమన్వయంతో రీ సర్వే కార్యక్రమం విజయవంతం చేయాలని తెలిపారు. గద్వాల ఐడి ఓసి మందిర లో సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం సర్వేకు సంబంధించి త్వరలో లైసెన్స్ సర్వేర్లతో సమన్వయ సమావేశం నిర్వహించి వారికి తగిన సూచనలు సలహాలు చేయాలని అన్నారు. రాజోలి ఎర్రవల్లి మండల కేంద్రంలోని తాసిల్దార్ తో పాటు. గద్వాల అలంపూర్ లో సబ్ రిజిస్టర్ కార్యాలయాల భవన నిర్మాణాలకు అనువైన స్థలాలను గుర్తించాలని అన్నారు. భూభారతి సదా బైనమా తదితర దరఖాస్తులను పెండింగ్లో గడువు లోపల పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్. గద్వాల్ డివిజన్ అధికారి శ్రీనివాసరావు సర్వే ఏడి నూకరాజు తదితరులు సిబ్బంది పాల్గొన్నారు.