ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని అర్హులైనవారందరు సద్వినియోగం చేసుకోవాలని

Feb 17, 2024 - 21:14
 0  24
ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని అర్హులైనవారందరు సద్వినియోగం చేసుకోవాలని

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ ఓ సంజీవ అన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంపై మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారులు గ్రామసభలు నిర్వహించి వాటి గురించి వివరించారు ఈ పథకoల్లో వడ్రంగి పడవలు చేసేవారు కుమ్మరి స్వర్ణకారులు శిల్పకారులు చెప్పులు కుట్టేవారు తాపీ పని చేసే వారు బుట్టలల్లేవారు చాపల వలలు చీపుర్లు బొమ్మలు తయారు చేసేవారు నాయి బ్రాహ్మణులు బట్టలు ఉతికేవారు దర్జీలు తయారీ రంగంలో కులవృత్తుల వారికి రెండు లక్షల రుణం కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల గ్రామపంచాయతీ కార్యదర్శులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు