విద్యార్థుల రవాణా కై లక్ష రూపాయలు విరాళం అందజేసిన ఆరాధ్య ఫౌండేషన్

Jul 10, 2026 - 05:50
Jul 10, 2026 - 12:47
 0  112
విద్యార్థుల రవాణా కై లక్ష రూపాయలు విరాళం అందజేసిన ఆరాధ్య ఫౌండేషన్

  విద్యార్థుల రవాణా కోసం ఆటో ఏర్పాటు చేసిన ఆరాధ్య ఫౌండేషన్ 

మరోసారి గొప్ప మానవత్వం చాటుకున్న ఆరాధ్య ఫౌండేషన్

ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తడోజు వాణి శ్రీకాంత్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా లక్ష రూపాయల విరాళం 

కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు పాఠశాల విద్యార్థి విద్యార్థులు 

 నాగారం,10 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- నాగారం మండలం మాచి రెడ్డిపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉండడంతో విద్యార్థి విద్యార్థులు సమీపంలోని ఈటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సి వస్తుంది. ప్రతిరోజు విద్యార్థులు కాలినడకన నడవాల్సి వస్తుంది ఈ సమస్యను గుర్తించిన ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈటూరు గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణంలో సర్పంచ్ వంగూరి దామోదర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో విద్యార్థుల రవాణా కోసం ఆటోను ఏర్పాటు చేయడంతో పాటు రవాణా ఖర్చుల నిమిత్తం ఒక లక్ష రూపాయలు విరాళాన్ని అందించారు. అనంతరం మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో నాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట బిక్షం, ఎంఈఓ ప్రభాకర్, ఉప సర్పంచ్ మంజుల, కార్యదర్శి బిమ్జా, రమేష్, గంట సోమిరెడ్డి, రామచంద్రు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి