జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు గా ఎంపిక.
జోగులాంబ గద్వాల 11 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఇటిక్యాల జోగులాంబ గద్వాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయు లుగా ఎంపికైన ఇటిక్యాల మండల పరిధిలోని ఎంపీపీ ఎస్ చాగాపురం ఎస్ జి టి ఉపాధ్యాయులు వినోద్ కుమార్ ఎస్ జి టి కి చాగాపురం గ్రామ యువకులు రవి. నజీర్. సన్మానం చేయడం జరిగింది. ఈ అవార్డు మీ అంకిత భావం మరియు అనన్యమైన సేవ స్ఫూర్తి కి కృతజ్ఞతల ప్రతీక భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన అవార్డులు తీసుకోవాలని విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపాలని సేవ చేయాలని కోరుతూ అభినందనలు తెలియజేశారు.