ప్రభుత్వ పెన్షనర్ల హక్కుల కోసం జరిగే ఆందోళన లో పాల్గొనండి"TSGREA ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘం

Jun 18, 2025 - 17:16
Jun 18, 2025 - 20:01
 0  132
ప్రభుత్వ పెన్షనర్ల హక్కుల కోసం జరిగే ఆందోళన లో పాల్గొనండి"TSGREA ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘం

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం : ప్రభుత్వ పెన్షనర్ల హక్కుల పరిరక్షణ కోసం జరిగే ఆందోళనలో పాల్గొనండి. TSGREA. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల హక్కుల పరిరక్షణ కోసం ఈ నెల 23 నుండి జరిగే దశల వారి ఆందోళనలో జిల్లాలోని పెన్షనర్లంతా పాల్గొనాలని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కళ్యాణం కృష్ణయ్య ఎం సుబ్బయ్య పెన్షనర్లకు పిలుపునిచ్చారు. నెహ్రు నగర్ లోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్ల హక్కులను హరించే కేంద్ర ప్రభుత్వ చర్యలు నిరసిస్తూ ఈ నెల 23న జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత మార్చి నెలలో పార్లమెంటు ఆమోదించిన నూతన పెన్షన్ విధానాన్ని పునరాలోచించాలని డివిజన్ ను తీసుకువచ్చే ఈ చర్యలను పెన్షనర్లు అందరూ తీవ్రంగా నిరసిస్తున్నారని తెలియజేస్తూ జిల్లాలోని రిటైర్డ్ ఉద్యోగుల సంతకాలతో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఖమ్మం జిల్లా కలెక్టర్ ద్వారా వినతి పత్రాలు పంపిస్తున్నట్లు వారు తెలిపారు. పే రివిజన్ జరిగినప్పుడు వచ్చే ఆర్థిక రాయితీలను పెన్షనర్లందరికీ అందించకుండా కేవలం కొంతమందికి మాత్రమే పెన్షన్ వర్తింపజేస్తూ ఆమోదించిన చట్టాన్ని రద్దుపరిచి పెన్షనర్లు అందరికీ సమాన న్యాయం అందించాలని అందుకు విరుద్ధంగా ప్రభుత్వం చర్యలకు పూనుకుంటే పెన్సిలర్ల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం జిల్లా కార్యవర్గ సభ్యులు పెన్షన్ కార్యాలయం ముందు నినాదాలు చేస్తూ పెన్షనర్లు హక్కులను రక్షించాలని కేంద్ర ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఈ నెల 23న జరిగే ఆందోళన జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తాళ్లూరు వేణు. ఉపాధ్యక్షులు టి జనార్ధన్. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పి సాంబశివరావు జిల్లా కోశాధికారి డి కె శర్మ. జిల్లా నాయకులు ఖాజా మొయినుద్దీన్ కూతురు కృష్ణమూర్తి ఖమ్మం నగర శాఖ నాయకులు కృష్ణమూర్తి ఆదినారాయణ ఆర్ వెంకట్ నారాయణ రాధాకృష్ణ రమేష్ వెంకటేశ్వర్లు శంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State