ఇ సైన్ స్కానింగ్ విధానం రద్దు చేయాలి
ప్రభుత్వ విధానాలతో ప్రజలకు ఇబ్బందులు.
సర్వర్ ప్రాబ్లెమ్ ను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి .
రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.
( సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 11) రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఈ సైన్ స్కానింగ్ విధానాన్ని రద్దుచేసి పాత పద్ధతిని కొనసాగించాలని సూర్యాపేట రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. గత పది రోజులుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం ఈ సైన్ స్కానింగ్ విధానం తీసుకురావడం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పది నిమిషాల్లో పూర్తయ్యేది గంటన్నర పైగా సమయం వృధా అవుతుందని అన్నారు. ప్రభుత్వం తలా తోక లేని విధానాలు తీసుకోవడం వల్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజలు సర్వర్ ప్రాబ్లం ఈ కేవైసీ స్కానింగ్ ప్రాబ్లం తో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని వాపోయారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా రియల్ ఎస్టేట్ రంగం ప్రభుత్వ విధానాలతో ఇబ్బందులు ఎదుర్కొంటుందని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు అవుతుందని విమర్శించారు. గతంలో పదివేల రూపాయలు చెల్లించిన వారికి ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని వాటికి కొత్త భవనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏర్పడుతున్న సర్వర్ ప్రాబ్లం నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పాటి అంజయ్య గౌడ్, రాపర్తి వెంకన్న గౌడ్, సరగండ్ల కోటేష్, గుమ్మడవెల్లి శీను, మధు, మహేష్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.