చెట్లను నాటండి పర్యావరణాన్ని కాపాడండి జిల్లా కలెక్టర్
తిరుమలగిరి 09 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి: పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఆధారమని ప్రతి ఒక్కరు చెట్లను పెంచాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గురువారం తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ చైర్మన్ శాగంటి అనసూయ రాములు అధ్యక్షతన జరుగుతున్న కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ప్రత్యేక అతిథిగా హాజరై చెట్లను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సకాలంలో వర్షాలు పడేందుకు చెట్లు దోహదపడతాయని స్వచ్ఛమైన గాలి అందుతుందని అన్నారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.రికార్డులను పరిశీలించి ఈ సీజన్లో వచ్చే వ్యాధులకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రంలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే సమాచారం అందించాలని.వెంటనే సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తాను అన్నారు. తిరుమలగిరి తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ నిర్వహించారు భూ సమస్యలను పెండింగ్ పెట్టకుండా త్వరగా పూర్తిచేయాలని మరియు విద్యార్థులకు క్యాస్ట్ మరియు ఇన్కమ్ పత్రాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరగా ఇవ్వాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామ దుర్గారెడ్డి, కౌన్సిలర్ బత్తుల శ్రీను,ప్రియలత రాము గౌడ్,కుదురుపాక శ్రీలత రాములు,పత్తిపురం సరిత నాగార్జున,చిర్రబోయిన హనుమంతు యాదవ్ తదితర కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.