నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన తొండ గ్రామవాసి గొలుసుల వెంకటేష్
తిరుమలగిరి 09 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని తొండ గ్రామానికి చెందిన గొలుసుల వెంకటేష్ ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచాడు.ఇందులో రెండు గెజిటెడ్ స్థాయి ఉద్యోగాలు కావడం గమనార్హం.ఇటీవలే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన ఫలితాల్లో వెంకటేష్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ),పాలిటెక్నిక్ లెక్చరర్,అసిస్టెంట్ ఇంజనీర్,గ్రూప్-4 కు ఎంపికై పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. ఓ వైపు ఒక ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షల కోసం చదువుతూ వివిధ ప్రైవేట్ సంస్థల్లో సివిల్ సైట్ ఇంజనీర్ గా పని చేశారు.కష్టపడి చదువుతూ (నీటిపారుదల అండ్ కమాండ్ ఏరియా అభివృద్ధి)శాఖలో కొలువు సాధించారు.వెంకటేష్ తిరుమలగిరి మండల కేంద్రంలోని శ్రీవాణి విద్యామందిర్ లో ప్రాథమిక విద్య,హైస్కూల్ విద్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివాడు.బీటెక్,ఎం.టెక్ సివిల్ ఇంజనీర్ విద్యను హైదరాబాదులోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ,ఎం.టెక్ మర్రి లక్ష్మణ్ రెడ్డి కాలేజీల్లో పూర్తి చేసాడు.ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో తల్లిదండ్రులు గొలుసుల వసంత,కొండయ్య, భార్య మానస,సోదరుడు మహేష్, తొండ గ్రామస్తులు వెంకటేష్ ను అభినందించారు.