చుక్క లక్ష్మీనారాయణకు ఏ ఎస్ఐ గా పదోన్నతి
జోగులాంబ గద్వాల 2 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా కేంద్రంలోని ఎస్పీ ఆఫీసులో గురువారము ఎస్పీ శ్రీనివాసులు చేతుల మీదుగా స్టార్ ను అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ లక్ష్మీనారాయణకు పదోన్నతి తోపాటు బాధ్యతలు కూడా పెరిగాయని, గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ కానిస్టేబుల్ గా ఉద్యోగం పొందిన తర్వాత అంచలంచలుగా ఎదిగి హెడ్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐగా పదోన్నతి పొందడం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో లక్ష్మీనారాయణకు ఒక్కనికి మాత్రమే పదోన్నతి వచ్చిందని, జిల్లాలో అతనికి మంచి పేరు ఉందని,ఏ పనిచేసిన నియమ నిబద్ధతగా పనిచేసేవాడని ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ ఉద్దేశించి మాట్లాడారు. ఏ ఎస్ ఐ ప్రమోషన్ పొందడం వలన బాధ్యత కూడా పెరుగుతాయని, బాధ్యతగా పనిచేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పి శంకర్, ఆర్.ఐ. లు వెంకటేష్, నరేష్ లు పాల్గొన్నారు.