చిన్ని కృష్ణుడు గోపికల వేషాధారణలో సందడి చేసిన చిన్నారులు:

Aug 26, 2024 - 19:54
Aug 26, 2024 - 20:32
 0  37
చిన్ని కృష్ణుడు గోపికల వేషాధారణలో సందడి చేసిన చిన్నారులు:

*చిన్ని కృష్ణుడు, గోపికల వేషధారణలో సందడి చేసిన చిన్నారులు*

సూర్యాపేట: జిల్లా కేంద్రంలో సోమవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హిందూ ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు ఎనిమిదో అవతారం శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారి బాలబాలికలు గోపికలుగా చిన్న కృష్ణుడుగా వేషదారణలో దర్శనమిచ్చి కనువిందు చేశారు. పిల్లల సంప్రదాయ వేషదారణను పలువురు అభినందించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ పిల్లలు నైతిక విలువలతో సమాజంలో రాణించాలని కొనియాడారు. పురాణాలలోని సంప్రదాయం, పండుగ రీతులు నేటి సమాజానికి ఆదర్శప్రాయం అవ్వాలని పేర్కొన్నారు. చిన్ని కృష్ణుని యొక్క లీలామృతాలు పసిపిల్లల హృదయాలలో చెరగని ముద్ర వేయాలని కోరారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223