ప్రజా ప్రతినిధులు ప్రజల్లో తిరిగితేనె ప్రజల సమస్యలు తెలుస్తాయి

Jul 24, 2024 - 17:01
Jul 24, 2024 - 17:01
 0  5
ప్రజా ప్రతినిధులు ప్రజల్లో తిరిగితేనె ప్రజల సమస్యలు తెలుస్తాయి

మమ్మల్ని చూసి మునిసిపల్ చైర్మన్  సైతం వార్డులో తిరగడం సంతోషకరం

అలాగే ఎమ్మెల్యే కూడా ప్రజల్లో తిరిగి సమస్యలు తెలుసుకోవాలి

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు

48వ వార్డులో మార్నింగ్ వాక్ లో మాజీ మంత్రి,

సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి

సూర్యాపేట 24 జులై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రజా ప్రతినిధులు ప్రజల్లో తిరిగితేనే ప్రజా సమస్యలు తెలుస్తాయని మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు.మార్నింగ్ వాక్ లో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 48 వార్డులో వీధి వీధి తిరుగుతూ ప్రజాసమస్యలు తెలుసుకొని మాట్లాడారు. నిన్నటి వరకు ఇంటికే పరిమితమైన మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణమ్మ మేము వార్డుల్లో మార్నింగ్ వాక్ నిర్వహిస్తుండడం చూసి తాను వార్డుల్లో పర్యటించడం సంతోషకరమన్నారు.అలాగే సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్ రెడ్డి కూడా హైదరాబాద్ కె పరిమితం కాకుండా ప్రజల్లో పర్యటించి సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని సూచించారు.

మార్కెట్ వ్యాపారులు ప్రజల సౌకర్యార్థం నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటానన్నారు. వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. వర్షాకాలం కావడంతో పట్టణ ప్రజలకు పారిశుధ్య సమస్య లేకుండా ఎప్పటికప్పుడు మున్సిపల్ అధికారులు పర్యవేక్షించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. వారంలో మూడు రోజులు తప్పకుండా తను వార్డులు పర్యటిస్తానని ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్న అక్కడికక్కడే పరిష్కరిస్తానని అన్నారు.