కస్తూర్బా గాంధీ పాఠశాలలో డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన

Aug 26, 2024 - 19:56
Aug 26, 2024 - 20:32
 0  371
కస్తూర్బా గాంధీ పాఠశాలలో డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన

 తిరుమలగిరి 27 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:-  ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు తిరుమలగిరి ఎస్సై సురేష్ కస్తూర్బా గాంధీ పాఠశాలలో సైబర్ నేరాలపైన, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, పోలీసు కళాభృందంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఎస్సై సురేష్ మాట్లాడుతూ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ అధ్వర్యంలో సైబర్ నేరాలపై, గంజాయి డ్రగ్స్ మత్తు మందులు, గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో, స్కూల్లో, కళాశాలలో చదువుకునే విద్యార్థులు, యువతి యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా ఏటీఎం కార్డ్ వివరాలు ఓటిపి వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దని అన్నారు సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే రోడ్డు నియమ నిబంధనలు తెలుసుకోవాలని అతివేగం ప్రయాణించవద్దు అని వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను డిపి లుగా పెట్టుకోవద్దని .మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు.గంజాయి మత్తుమందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు     యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలన్నారు. సామాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలని అన్నారు  అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో విద్యార్థినిలకు అవగాహన కల్పించారు  ఈ కార్యక్రమం నందు కస్తూర్బా గాంధీ పాఠశాల ఎస్ఓ సుస్మిత, సునిత, పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ సైదులు, హోంగార్డ్ వెంకన్న కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య, గురులింగం, క్రిష్ణ,చారి, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034