చిన్నంబావి మండలంలో బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల స‌మావేశం

Oct 7, 2025 - 19:27
 0  3
చిన్నంబావి మండలంలో బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల స‌మావేశం

గ్రామాల‌వారీగా గులాబీ జెండా ఎగరాలి 

మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

చిన్నంబావి మండలం 07 అక్టోబర్ 2025తెలంగాణ వార్త :  చిన్నంబావి మండల పరిధిలోని పెద్దమారుర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరాలని, బీఆర్ఎస్ పార్టీ తరపున అత్యధిక స్థానాలను గెలిచి మాజీ సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. పెద్దమారూర్ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వడ్డేమాన్ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీరం హర్షవర్ధన్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయింది. ప్రజలు ఎక్కడికెళ్లినా కేసీఆర్‌ను ఊడగొట్టి తప్పు చేశామని బాధపడుతున్నారు అని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచ్ స్థానాలను భారీ మెజార్టీతో గెలుచుకోవాలన్న లక్ష్యంతో ప్రతి గ్రామంలో కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. పార్టీ తరపున ఆశావహులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో సమన్వయంతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు.“రిజర్వేషన్ అనుకూలంగా రాలేదని నిరుత్సాహపడవద్దు. పార్టీ ఇచ్చిన అవకాశాల కోసం కృషి చేయాలి. ప్రజల్లోకి వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలి అని ఆయన పిలుపునిచ్చారు. తాజా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, 22 నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్కటి నెరవేర్చలేదు మహిళలకు రూ. 2500, వృద్ధులకు రూ. 4000, దివ్యాంగులకు రూ. 6000 పింఛన్, కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్‌ కు తులం బంగారం, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు స్కూటీ వంటి వాగ్దానాలు అన్ని బాకీగా ఉన్నాయి. ఈ బాకీ కార్డులను కాంగ్రెస్ వైఫల్యానికి సాక్ష్యాలుగా ప్రతి కార్యకర్త వినియోగించాలి అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలను గెలిచి, కేసీఆర్ నాయకత్వానికి కానుకగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడం ద్వారా గులాబీ జెండా మళ్లీ ఎగురవేయాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ టి. సోమేశ్వరమ్మ, గోవిందు శ్రీధర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు తగరం లక్ష్మి కురుమయ్య, మాజీ ఎంపీపీ చెల్లపాడు తిరుపతయ్య, జయ గౌడ్, రాజేశ్వర్ రెడ్డి, ఆనంద్ యాదవ్, మండల నాయకులు, వివిధ గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333