చిన్నంబావి మండల కేంద్రంలో ని  తెలంగాణ విమోచన దినోత్సవం

Sep 17, 2025 - 19:37
 0  8
చిన్నంబావి మండల కేంద్రంలో ని  తెలంగాణ విమోచన దినోత్సవం

భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలు

 చిన్నంబావి మండలం తెలంగాణ వార్త : చిన్నంబావి మండల కేంద్రంలో బుధవారం బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు బొగ్గు కురుమయ్య ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం, భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాల్మీకి చౌరస్తా వద్ద మండల బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ నాయకులు, నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ సెక్రటరీ, మండల నాయకులు కలిసి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ–“తెలంగాణ విమోచనలో సర్దార్ వల్లభాయ్ పటేల్  కృషి అపారమైందని, ఆయన ఉక్కు సంకల్పం మరియు భారత సైనికుల ధైర్య సాహసాల వల్లే నిజాం నిరంకుశ పాలనకు ముగింపు లభించిందని” అన్నారు. రాష్ట్ర బిజెపి నాయకుడు కురువ చిన్న మల్లయ్య మాట్లాడుతూ “సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలు నిరంకుశ నిజాం పాలన నుండి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చారు. రజాకర్ల రాక్షస కరాల కృత్యాలకు చరమగీతం పాడిన రోజు ఇదే అని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర నాయకులు కురువ చిన్న మల్లయ్య, ధారాసింగ్, జిల్లా జనరల్ సెక్రటరీ జగ్గారి శ్రీధర్ రెడ్డి, మండల అధ్యక్షులు బొగ్గు కురుమయ్య, మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో స్వాతంత్ర్యానికి ప్రతీక, నిరంకుశ నిజాం పాలనకు చరమగీతం పాడిన రోజు, రజాకర్ల రాక్షస పాలనకు ముగింపు పలికిన రోజు అని గుర్తుచేశారు. ఈ సందర్భంగా అమరవీరులను స్మరించుకుంటూ ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు మరియు వివిధ గ్రామాల పార్టీ కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333