అధిక అసమానతలు ఉన్న నేలపై  అసంతృప్తి  కోపము  కొన్ని వర్గాలకు తప్పనిసరి.

Apr 6, 2025 - 13:01
 0  1

 అసమ సమాజమే మన లక్ష్యమా? సమానత్వాన్ని  సాధించడానికి  జిడిపిలో ఎక్కువ శాతం కనీస అవసరాలపై  నిధులు వెచ్చించడం అవసరం.

ప్రపంచ అసమానతలపై  మండిపడిన ఆర్థికవేత్త ప్రొఫెసర్ జయతి ఘోస్

---వడ్డేపల్లి మల్లేశం 


ఇప్పటికే ప్రపంచం అసమానతలు అంతరాలతొ   పెచ్చు  మీరి  పోగా అసమ సమాజం  రెండు వర్గాలుగా చీలిపోయిన విషయం గమనించాలి ఇది  సమాజ భద్రతకు,  మానవ ఆస్తిత్వానికి,  సంక్షేమం అభివృద్ధికి అంత మంచిది కాదు. అందుకే ఈ అంశం పైన ప్రముఖ ఆర్థికవేత్తలు,  రాజనీతివేత్తలు   నిరంతరం ప్రభుత్వాలను పాలకులను ప్రపంచ నాయకత్వాన్ని హెచ్చరిస్తున్నా  వాళ్ల విధానాన్ని మార్చుకోకపోగా  ఆర్థిక అరాచకత్వానికి, ఆధిపత్యానికి పాల్పడడం ముఖ్యంగా ఇటీవల కాలంలో అమెరికా విధానాన్ని  స్పష్టంగా చూడవచ్చు. భారతదేశంలో పేదరికం దారిద్రేక దిగువన  ఉన్న వాళ్ళ శాతం గణనీయంగా ఉన్న నేపథ్యంలో కనీస అవసరాలను తీర్చుకోగలిగిన స్థాయిని మానవాభివృద్ధి అంటారని  ఆ మానవాభివృద్ధి ని సాధించడాన్ని  ప్రభుత్వాలు కీలకంగా భావించాలని ఏనాడో ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్యసేన్ హెచ్చరించిన విషయం అందరికీ తెలుసు.  ప్రస్తుతం  అమెరికాలోని  మసాజ్ సెట్స్  విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జయతి గోష్  ప్రపంచంలో అసమానతలు తీవ్ర రూపం దాల్చినాయని అదే సందర్భంలో  కనీస అవసరాల పైన  జిడిపిలో ఎక్కువ శాతం కేటాయించడం ద్వారా  పేద మధ్యతరగతి వర్గాలకు  కొంత ఊరట కలుగుతుందని  చేసిన హెచ్చరికను కూడా పాలకులు ప్రపంచ నాయకత్వం గుణపాఠంగా స్వీకరించాలి..హైదరాబాదులో మంతన్ ఆధ్వర్యంలో  14 మార్చి 2025 రోజున  శుక్రవారం  "పెట్టుబడిదారీ వ్యవస్థలో మానవహక్కులు భారతదేశ0ముందున్న అవకాశాలపై"  ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ మాజీ సంపాదకుడు రామ మనోహర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన  సదస్సులో ఆమె  కీలక  ఉపన్యాసం చేశారు .అమెరికా అధ్యక్షుని   వి o  త పోకడలతో పాటు ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక పరిస్థితుల పైన పూర్తిస్థాయిలో అంచనా వేసిన జయతీ  గోష్  కట్టుదిట్టమైన చర్యలు ప్రత్యేక వర్గాలకు నిధుల కేటాయింపు  సమానత్వ సాధన వైపుగా ప్రభుత్వాల చర్యల  పైన సుదీర్ఘ ప్రసంగం చేయడం  ఇప్పటికైనా పాలకులకు ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వాలకు  గుణపాఠంగా భావించవలసిన అవసరం చాలా ఉన్నది.ఆమె ప్రసంగాన్ని ఆమె మాటల్లోనే పూర్తి పాఠం 
""""అసమానతలు తీవ్రమైన నేపథ్యంలో ప్రజల యొక్క కనీస అవసరాలు అయినటువంటి ఆరోగ్యం, విద్య, పౌష్టికాహారం,  కనీస అవసరాల పైన జిడిపిలో ఎక్కువ శాతం ఖర్చు చేసినప్పుడే వారి హక్కులను సంరక్షించడం సాధ్యమని అది ఏ దేశానికైనా తప్పనిసరి అని  ఆమె  పాలకులను హెచ్చరించారు.  కనీస అవసరాలు తీరనప్పుడు ప్రజల్లో అసంతృప్తి కోపం ఆగ్రహం  పెరుగుతాయి  ఈ పరిస్థితుల నుంచి దృష్టి మరలచడానికి ప్రభుత్వాలు అనేక రకాల ఎత్తుగడలు నాటకాలు చేస్తున్నాయి.  కానీ ఆ భ్రమల నుంచి బయటపడకపోతే ప్రజలు ప్రజాస్వామిక వాదులు తమ ఉద్యమ శక్తితో పాలకుల మెడలు వంచి  ప్రభుత్వాల తీరును ఎండగడతారని ఇక్కడ వారి ప్రసంగము ద్వారా మనకు తెలుస్తున్నది. అమెరికాలో ట్రంప్ యొక్క ఏకపక్ష దొరణులు,  యూరప్ దేశాలలో వలసదారులఅంశం,  భారతదేశంలో మైనార్టీల అంశం, ప్రపంచవ్యాప్తంగా భిన్న వర్గాల మధ్యన ఉద్రిక్తతల  పైన స్పష్టమైనటువంటి  ఆలోచనను ఆమె ప్రస్తావించడం చాలా స్వాగతించదగినది.
       " సుంకాలు పెంచడం వలన ప్రైవేట్ పెట్టుబడులు పెరిగి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ట్రంప్ పేర్కొంటున్నప్పటికీ ఆచరణలో అది జరిగే అవకాశం లేదని పెట్టుబడిదారీ వ్యవస్థలో సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కావడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేసింది.  రాజకీయ అధికారం  నియంత్రణ చర్యలు  పెట్టుబడిదారు చేతుల్లోనే ఉంటున్నాయని భారత దేశంలో ఒక్క శాతం సంపన్న వర్గాల చేతిలో 40 శాతం సంపద కేంద్రీకృతం కావడం ఇ o  దుకు పెద్ద ఉదాహరణగా మనం భావించవచ్చు..  పెట్టుబడిదారుల చేతిలో అధికారం ఉన్న కారణంగా ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతున్నట్లు  ఆందోళన వ్యక్తం చేసిన ఆమె ప్రైవేటు పెట్టుబడులు పెరగడం లేదు ఫలితంగా ఉత్పత్తి నాణ్యమైన ఉపాధి అవకాశాల్లో పెద్దగా పురోగతి లేదు.మన ప్రభుత్వాలు జిడిపి వృద్ధిరేటు గురించి మాట్లాడుతున్నాయి కానీ జి  డిపి పెరుగుదలకు ప్రజల జీవన ప్రమాణాలకు పొంతన లేకుండా పోయింది.భారతదేశంలో ఆరోగ్య రంగంపై టిడిపిలో ఒక్క శాతానికి మించి వెచ్చించడం లేదంటే అతిషయోక్తి  కాదు అని విమర్శించారు. విద్యకు 6% కోరుతున్న మూడు శాతానికి మించడం లేదని  ఈ దేశంలో సంపన్నులు పెట్టుబడిదారులు పన్నులను ఎగవే  స్తూ దోపిడికి పాల్పడుతున్నారని కానీ చిన్న మధ్యతరగతి వర్గాలు తప్పించుకునే అవకాశం లేక నష్టపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేయడం ప్రస్తుత ప్రాపంచిక భారతదేశ పరిస్థితులకు అద్దం పడుతున్నది.  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించడానికి,దేశాల మధ్యన అసమానతలను పెంచి పోషించడానికి  తీవ్రంగా కృషి చేస్తున్నాడని  ఇది ప్రాపంచిక అస్థిరత్వానికి అశాంతికి దోహదపడుతుంది కానీ మానవ మనుగడకు  కాదని ఆమె ఆందోళన వ్యక్తం చేయడం నేడు ప్రపంచంలో తి ష్ట వేసినటువంటి  దుర్భర పరిస్థితులకు అద్దం పడుతున్నది. ప్రముఖ కవి  రచయిత విజయ్ నంబిషణ్ స్మారకార్థంగా నిర్వహించిన ఈ సదస్సులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకునే అవకాశం రావడం  ప్రధాన అంశం కాగా  భారతదేశంలో తిష్ట వేసినటువంటి దుర్భర పరిస్థితుల నుండి బయటపడడానికి కూడా ప్రముఖ సూచనలు వచ్చినట్లుగా భావించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది
  ఈ ఆర్థిక అసమానతలు ఇలాగే కొనసాగితే పేదరికం, దారిద్రరే క దిగు వన గల వారి శాతం మరీ పెరిగితే  ప్రజా ఉద్యమాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుందని పాలకులు గుర్తించడానికి ఈ వేదిక ఈ ప్రసంగం ఒక సూచికగా  పనిచేస్తుందని భావిద్దాం .
     రాజ్యాంగం లోని ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలతో పాటు పీఠికలో కూడా  సమానత్వం, న్యాయం, సర్వభౌమాధికారం, సామ్యవాద వ్యవస్థ గురించి గొప్పగా రాసుకున్నాం. కానీ వాటిని ఆచరించే విషయంలో 75 ఏళ్లుగా ప్రభుత్వాలు తమ ధోరణి తామే అన్నట్లుగా ప్రైవేటు వర్గాలకు వంత పాడుతూ ఉంటే  ఈ రకంగా  ప్రపంచవ్యాప్తంగా భారతదేశo  విమర్శలకు గురికావాల్సిందేనా? అసమానతలు అంతరాలతో ఈ దేశం  నిలువునా చీలిపోవాల్సిందేనా? ఒక్కసారి ప్రజలు ప్రజాస్వామ్యవాదులు భిన్న వర్గాలు మేధావులు ఆలోచించుకోవలసిన తరణం ఆసన్నమైనది. .పేద వర్గాలు విద్యా వైద్యానికి తమ ఆదాయంలో 70--80 శాతం పైగా ఖర్చు చేస్తున్నప్పుడు  ప్రభుత్వాలు  విద్య వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రైవేటు వర్గానికి అప్పగించి చేతులు దులుపుకున్నప్పుడు  ఈ అంతరాలు పేదరికం మరింత పెరిగిపోయే ప్రమాదం లేదా? ఇది కనీసమైన అవగాహన కల ఎవరికైనా అర్థమవుతుంది కానీ పాలకులకు ఎందుకు అర్థం కావడం లేదో ! అందుకే సమాజం సిగ్గుతో తలదించుకోవదాన్ని గమనిస్తే ఎన్నో రంగాలలో మనదేశం వెనుకుబడి ఉండదాన్ని గమనించవచ్చు. 
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు  హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333