నగరాలు ఉపాధి కేంద్రాలని సంబరపడితే ఎలా?
నగరాలు ఉపాధి కేంద్రాలని సంబరపడితే ఎలా?* కాలుష్య కొరల్లో ఎన్నో ప్రాంతాల ప్రజలు దుర్భర జీవితం గడపడం కనిపించడం లేదా ?ఉపాధి అవకాశాలను, అభివృద్ధి ఆనవాళ్లను గ్రామ ఇతర పట్టణ ప్రాంతాలకు విస్తరింప చేయడమే పరిష్కారం.
వడ్డేపల్లి మల్లేశం
02...04...2025
కిక్కరి సిన జనాభాతో నగరాలు అత్యంత దయనీయ స్థితిలో కనీస అవసరాలను నెరవేర్చుకునే క్రమంలో మంచినీరు మరుగుదొడ్లు నివాసము ఉపాధి లేమితో అష్ట కష్టాలు పడుతున్న సంగతి తెలియదా? ఇదంతా పేదలు ఉన్నటువంటి ధనవంతమైన ప్రాంతాలుగా పట్టణాలను వర్ణిస్తే సరిపోతుందా? పట్టణ జనాభాను ఎప్పటికీ పెంచుకుంటూ పోయి అవకాశాలను అక్కడికే పరిమితం చేస్తే అసమానతలు అంతరాలు ప్రాంతాల మధ్యన కొనసాగి మరో ఉద్యమాలకు దారి తీయవా? గతంలో ప్రపంచంలోని అనేక ప్రాంతాలతో సహా భారతదేశంలో రాష్ట్రాలు విడిపోవడానికి ఆ రకమైనటువంటి వివక్షతే కారణం కదా !పె రుగుతున్న జనాభాను తట్టుకోవడానికి నిర్మిస్తున్న నిర్మాణాలు కూడా లోప భూష్టం కాగా వాగులు వంకలు సెలయేర్లు వంపులు మి ట్టలు, గుట్టలు ప్రణాళికకు దూరంగా నిర్మించబడుతూ ఉంటే వర్షాకాలంలో పట్టణాలు మునిగిపోయిన సంగతి మనకు తెలియదా? ఇంత జరిగినా కూడా పాలకులకు పెట్టుబడిదారులకు పట్టణాల మీద మోజున్న కొందరికి సోయి లేదు అంటే అంతకుమించినటువంటి కు సంస్కారం మరొకటి ఉండదు. నగరాలలోనే విషపూరితమైనటువంటి కాలుష్యాలను వెదజల్లే పరిశ్రమలను స్థాపించడం అక్కడికి సమీపంలోనే ప్రజా జీవితం కొట్టుమిట్టాడుతూ అనేక ఇబ్బందులకు గురి కావడం ప్రాంతాలు భాషలు అవకాశాలు వనరులు అభివృద్ధి అసమతుల్యత కారణంగా పోరాటాలు జరగడం లాంటివి మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ అన్ని సమస్యల పరిష్కారానికి గాను పట్టణాల్లోనే విద్య ఉద్యోగ అవకాశాలు ఐటి రంగము పరిశ్రమలు వైద్యరంగం విస్తరించే బదులు పట్టణ గ్రామ ప్రాంతాలకు అతీతంగా దేశం లేదా ఒక రాష్ట్రాన్ని యూనిటీగా తీసుకున్నప్పుడు ప్రాంతాలవారీగా కొన్ని కొన్ని అభివృద్ధి అవకాశాలను పరిమితం చేయడం వల్ల అన్ని ప్రాంతాల పురోగతికి అవకాశముంటుంది. అలాంటి సందర్భంలో ప్రజలు కూడా ఇతర ప్రాంతాలకు వలస పోవడానికి ఎగబాకే అవకాశం ఉండదు కదా ఇప్పటికీ అనేక గ్రామీణ ప్రాంతాలలో రవాణా సౌకర్యాలు మెరుగుపడిన కారణంగా మంచి భవనాలతో పాటు ఆధునిక సౌకర్యాలతో గ్రామాలలో ప్రజలు జన రంజకంగా జీవిస్తున్న విషయాన్ని గమనించినప్పుడు ఈ స్పృహ పట్టణాలను నిర్మించే అటువంటి పాలకులకు పెద్దలకు లేకపోవడం సిగ్గుచేటు. ఒక రాష్ట్రం లేదా దేశ బడ్జెట్ను గమనించినప్పుడు పట్టణ ప్రాంతాలకు భారీగా ఖర్చు చేయడం గ్రామీణ ప్రాంతాలకు నామమాత్రం కేటాయించడం అనే విషయాలను గమనిస్తే అలాంటి సందర్భంలో కచ్చితంగా ఇలాగే బడ్జెట్ కేటాయింపులు జరిగినట్లయితే గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా పాలకులపైన ఎదురు తిరగక తప్పదు. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో ప్రాంతాలలో బలమైనటువంటి నాయకులు ఉన్న ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందడం మిగతా శాసనసభ్యులు లేదా ఎంపీలు ఉన్న ప్రాంతాలలో నామమాత్రపు అభివృద్ధి కొనసాగడం అనేది జరుగుతున్న నేపథ్యంలో ప్రాంతాలు విడిపోవడానికి జరుగుతున్నటువంటి ఉద్యమాలు పోరాటాలు ప్రపంచ చరిత్రలో మనం నిత్యం గమనిస్తున్నదే కదా! అలాంటప్పుడు అన్ని ప్రాంతాలకు కూడా సమాన అవకాశాలు కల్పించే విధంగా వనరులు అవకాశాలు అభివృద్ధి మూలాలు ప్రాంతాలవారీగా కేటాయించి అన్ని ప్రాంతాల ప్రజలు యువత నిరుద్యోగులు ఉపాధి పొందడానికి తగిన అవకాశాలను కల్పించవలసిన అవసరం ప్రస్తుతం పాలకుల పైన ఉన్నది.ప్రపంచవ్యాప్తంగా కొన్ని గణాంకాలు పరిశీలిస్తే కొన్ని దేశాలలోని ప్రధాన పట్టణాల జనాభా 1950 నుండి ఏ రకంగా పెరిగిందో అర్థం చేసుకుంటే రాబోయే ప్రమాదానికి సంకేతంగా ఉప్పెనకు సూచనగా ప్రకృతి సంక్షోభాలకు మూలంగా పట్టణ ప్రాంతాలను గుర్తించవలసి ఉంటుంది.ఇప్పటికే అనేక రకాలైనటువంటి పరిశ్రమలతో విస్తరించినటువంటి ప్రాంతాలు జనావాసాలకు చేరువలో ఉన్న కారణంగా లక్షలాదిమంది చనిపోవడం ప్రమాదాలు జరిగినప్పుడు వారి కుటుంబాలు వీధిపాలు కావడం ఉపాధిని కోల్పోవడం ఉనికి లేకుండానే పోయిన సందర్భాలను గమనించినప్పుడు ఇప్పటికైనా పాలకులకు ఆయా దేశాల్లోని పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన రాకపోతే భవిష్యత్తు అంధకారమే. అదే దురాలోచన పాలకులను వారి పీఠాలను కదిలిస్తుందని తెలుసుకోవడం చాలా అవసరం. ఈ వివక్ష కారణంగా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోయి అనివార్యమైతే కుటుంబాన్ని గాలికి వదిలి పట్టణ ప్రాంతాలకు వలస పోయి నికృష్ట జీవితం గడుపుతున్నటువంటి లక్షలాది కుటుంబాలను గమనించినప్పుడు వాళ్ళ పిల్లలకు విద్య వైద్య అవకాశాలను తీర్చుకోలేక ఎంత దిక్కుమాలిన జీవితం బతుకుతున్నారో అర్థం చేసుకుని ఇ ప్పటికైనా పట్టణ జనాభాను పెంచకూడదు పల్లెటూర్లే ముద్దు అనే సోయి ఇప్పటికి ప్రపంచ మేధావులకు పాలకులకు ఐక్యరాజ్యసమితికి రాకపోవడం సిగ్గుచేటు. ఈ అంశం పైన ఏ దేశానికి ఆదేశం తన నిర్ణయాన్ని ప్రకటించుకోవడం ద్వారా గుణాత్మకమైన అభివృద్ధి కోసం మానవీయ కోణంలో ఆలోచించడం చాలా అవసరమని నొక్కి చెప్పవలసివుంది.భౌతికవస్తులు చాలీచాలకుండా ఉన్న కారణంగా నగర జీవితం దుర్భరమవుతున్న నేపథ్యంలో ఈ గణాంకాలను ఒక్కసారి పరిశీలిద్దాం ఆయా దేశాల్లోని పాలకులు గ్రామీణ ప్రాంతాలను పట్టించుకునే క్రమంలో సోయి తెచ్చుకోవాలని ఆకాంక్షిద్దాం. 1950 ప్రాంతంలో ఢిల్లీ జనాభా 13.7 లక్షలు ఉంటే 2024 నాటికి 3 కోట్లకు మించిపోయింది. ముంబై కూడా 1950లో 30.9,ల. జనాభా ఉంటే 2024 నాటికి రెండు కోట్లకు పైగా పెరిగినట్లు విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రాన్స్ దేశపు రాజధాని పారిస్ జనాభా గత ఏడున్నర దశాబ్దాలలో 62.8 లక్షల నుండి ఒకటి పాయింట్ ఒకటి మూడు కోట్లకు చేరుకోవడం జపాన్ రాజధాని టోక్యో నగర జనాభా 1950లో ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్ల నుండి 2024 నాటికి 3.70 కోట్లకు ఇగబాకడాన్ని ఎలా చూడాలి అలాగే డాకా జనాభా కూడా ఏడున్నర దశాబ్దాలలో 3.35 లక్షల నుంచి 2.46 కోట్లకు చేరుకోవడం అంటే అభివృద్ధిని పట్టణాలలో కేంద్రీకరించడం వల్లనే కదా ఈ అపోహ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రావడం వల్ల కూడా అసమ సమాజం అసమ అభివృద్ధి ఏర్పడాన్ని మనం సీరియస్ గా పరిగణించవలసిన అవసరం ఉంది. .అమెరికా రాజధాని న్యూయార్క్ నగర జనాభా కూడా 1.23 కోట్ల నుండి 1. 9 1కోట్లకు పెరిగిపోయి గ్రామీణ ప్రాంతాలను వెక్కిరిస్తుంటే ఈ వివక్షత పైన యుద్ధం చేయడానికి గ్రామీణ ప్రాంతాలు కూడా సన్నద్ధమవుతున్న సన్నివేశాన్ని గమనించవలసిన అవసరం ఉంటుంది .ఇప్పటికైనా జరిగిన పొరపాట్లను సవరించి ప్రపంచంలోని ఆయా నగరాలు పట్టణ జనాభాను తీవ్రంగా తగ్గించడానికి ప్రజలు గ్రామీణ ప్రాంతాలకు తిరిగి వెళ్లే విధంగా కృషి చేయడానికి గ్రామీణ ప్రాంతాలలోనే అభివృద్ధి సంస్థలను నిర్మించడానికి పూనుకున్నట్లయితే విస్తృతమైన స్థాయిలో భూమి ఇతర మౌలిక వసతులు లభిస్తాయి. దానివల్ల పెట్టుబడిదారులకు కూడా ఎక్కువ ఖర్చు కాకుండా అభివృద్ధిని చట్టబద్ధం చేయడానికి అవకాశం ఉంటుంది తద్వారా సంపదను సృష్టించవచ్చు తిరిగి ఆ సంపదను ప్రజలందరికీ పంచడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఆ రకమైన కృషి ఇప్పటినుండి ఒక 10 ఏళ్లలో జరపాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ పాలకులు ఇదే మూర్ఖత్వంతో కొనసాగినట్లయితే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేదానికి uno జనాభా సంబంధించి సామాజిక సంబంధాల విభాగం ఇటీవల వెలువరించిన ఒక పట్టిక ఆశ్చర్యానికి గురి చేయక తప్పదు. పట్టణాల అభివృద్ధిని ఇలా కొనసాగించడానికి పాలకులు పూనుకుంటే, ఈ దుష్పరిణామాలపైన ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు ఉక్కు పాదం మోపకుంటే, గ్రామీణ ప్రాంత ప్రజలు చె తి రుగుబాటు చేయకుండా ఉంటే, పాలకులు ఇదే పట్టణాల భ్రమలోనే మునిగిపోతే 2035 నాటికి ప్రపంచంలోనే ఈ కింద దేశాలలో జనాభా ఎంత స్థాయికి పెరుగుతుందో వేసిన అంచనా ఆలోచిస్తేనే భయంకరo గా ఉంటుంది.. వచ్చే పదేళ్లలో ఢిల్లీ జనాభా 4.33 కోట్లకు, టోక్యో జనాభా 3.60 కోట్లకు, దాకా జనాభా 3.12 కోట్లకు, ముంబై జనాభా 2.73 కోట్లకు, లాగోస్ జనాభా 2.44 కోట్లకు, న్యూయార్క్ జనాభా 2.08 కోట్ల కు ఇస్తాంబుల్ జనాభా 1.7 9 కోట్లకు,పారిస్ జనాభా 1.20 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక సంబంధాల విభాగము ప్రకటించిన గణాంకాల ద్వారా తెలుస్తున్నది.ప్రపంచంలోని ఇతర దేశాలను పక్కన పెడదాం భారతదేశం గ్రామీణ ప్రాధాన్యత కలిగినటువంటి గ్రామీణ ప్రాంతాలలో భూమి ఇతర సౌకర్యాలు వ్యవసాయం లాంటి అనేక అంశాలున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలు కేంద్రంగా అభివృద్ధి పలాలను అందించడానికి ప్రభుత్వాలు కొత్త చర్యలను విప్లవాత్మక మార్పులను చేపట్టవలసినటువంటి అవసరం ఉంది. అ నిర్ణయం తీసుకోకపోతే రానున్న కాలంలో మొత్తం విషపూరితమై ప్రమాదగంటికలు మోగే అవకాశం ఉంటుందని ఇప్పుడున్న పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి. ప్రకృతి లో జరిగే ఉత్పాతాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అనేక సందర్భాలలో చూసి ఉన్నాం. ఇప్పటికైనా మన ప్రణాళికను, ఆచరణను, వ్యూహాలను గ్రామీణ ప్రాంతాలకు మధ్యతరగతి పట్టణాలకు విస్తరింప చేయడం ద్వారా సమ అభివృద్ధి సాధ్యమవుతుంది. అంతేకాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం నగరాల మీద ఒత్తిడి పడకుండా ఉండడం తద్వారా ప్రజా జీవితం సుభిక్షంగా జరిగే అవకాశం ఉంటుందని తెలుసుకోవడం అవసరం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు జిల్లా సిద్దిపేట తెలంగాణ)