వెల్దేవి గ్రామంలో గడ్డి మందు తాగి యువకుడు మృతి
అడ్డగూడూరు 06 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామానికి చెందిన గంట మల్లయ్య కుమారుడు గంటా వినోద్ కుమార్ గడ్డి మందు తాగి మృతి చెందిన సంఘటన వెల్దేవి గ్రామంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే గంట వినోద్ కుమార్ కుటుంబ కలహాల వల్ల మన స్థాపన చెంది గడ్డిమందు తాగిన విషయాన్ని తన అమ్మమ్మ కన్నెబోయిన పిచ్చమ్మకు ఫోన్ ద్వారా తెలియజేసిన వెంటనే హుటా హుటిన బంధువులు నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నల్గొండ నవ్య ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గంటా వినోద్ కుమార్ శుక్రవారం రోజు ఉదయం 05.3 గంటలకు మృతి చెందినట్లు డాక్టర్ లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.