పంతంగిని గెలిపిస్తే వార్డును దత్తత తీసుకుంటా

Feb 7, 2026 - 19:14
 0  3
 పంతంగిని గెలిపిస్తే వార్డును దత్తత తీసుకుంటా
 పంతంగిని గెలిపిస్తే వార్డును దత్తత తీసుకుంటా

అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. 

 మున్సిపాలిటీలను అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ దే. 

 ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి .

 వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. 

 14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంతంగి దశరథ గౌడ్ .

 (సూర్యాపేట టౌన్, ఫిబ్రవరి 7) :  అధికార పార్టీ తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు శనివారం జిల్లా కేంద్రంలోని కుడ కుడ స్నేహ నగర్ కృష్ణానగర్ లో మార్నింగ్ వాక్ లో భాగంగా వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పంతంగి దశరథ గౌడ్ తో కలిసి  ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలలో ప్రజా సమస్యలను గుర్తించి మౌలిక వస్తువులను కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి సాధ్యమని గుర్తు చేశారు. సూర్యాపేట మున్సిపాలిటీలో మిగిలి ఉన్న పనులను త్వరితగతిన చేపట్టే బాధ్యత తాము తీసుకుంటామని చెప్పుకొచ్చారు. సూర్యాపేటలో నాలాలను ఆక్రమించి భూములను కబ్జా చేసిన వారి విషయంలో ఎన్నికల అనంతరం చర్యలు తీసుకుంటామని కబ్జాలను సహించేది లేదని హెచ్చరించారు. స్థానికుడైన దశరథుని గెలిపిస్తే వార్డును దత్తత తీసుకొని ప్రత్యేక అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పంతంగి దశరథ గౌడ్ మాట్లాడుతూ వార్డులో ఉన్న డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని  అన్నారు. కరోనా సమయం తో పాటు నేటికీ సామాజిక కోణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. వార్డు ప్రజలు  చేతి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, నాయకులు గోదల రంగారెడ్డి రాజేష్ నాయక్, లక్ష్మయ్య, రిటైర్డ్ టీచర్స్, తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333