ఘోర రోడ్డు ప్రమాదం .. స్పాట్ డెడ్

Nov 23, 2025 - 14:56
 0  1300
ఘోర రోడ్డు ప్రమాదం .. స్పాట్ డెడ్

తిరుమలగిరి 23 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట మరియు జనగాం 365 జాతీయ రహదారి పై తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది వివరాలకు వెళితే  తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని నీలిబండ తండాకు చెందిన ఆంగోతు బద్య (50)  అనే వ్యక్తి ప్రతిరోజు కూరగాయలు విక్రయించి తిరిగి వెళ్ళేవాడు రోజువారి లాగానే మున్సిపల్ కేంద్రంలోని కూరగాయలను విక్రయించి తన స్వగ్రామమైన తండాకు వెళుతున్న క్రమంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ద్విచక్ర వాహనం మూలమలుపుతుండగా అతి వేగంతో దూసుకు వచ్చిన మహేంద్ర తార్ కారు TS 07 KD 3303 డి కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు దీంతో స్థానికుల సమాచారం తో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఆసుపత్రికి తరలించారు కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగి పోయారు మృతునికి భార్య ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమారులు గలరు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి