ఘనంగా శ్రీ రామలింగేశ్వర హనుమాన్ దేవాలయం 64వ వార్షికోత్సవ వేడుకలు

Feb 21, 2024 - 17:22
 0  10
ఘనంగా శ్రీ రామలింగేశ్వర హనుమాన్ దేవాలయం 64వ వార్షికోత్సవ వేడుకలు
శ్రీ రామలింగేశ్వర హనుమాన్ దేవాలయంలో హరే రామ సంకీర్తన చేస్తున్న భక్తులు

మునగాల 21 ఫిబ్రవరి 2024

తెలంగాణ వార్తా ప్రతినిధి :-

మునగాల మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర హనుమాన్ దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా 72 గంటల పాటు అఖండ హరే రామ నామ సంకీర్తన నిర్వహించబడుతుందని ఆలయ అధ్యక్షులు తూముల వీరస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రోజున హనుమాన్ శోభాయాత్రను నిర్వహించమని, అంతరం బుధవారం రోజున 72 గంటల పాటు నిర్విరామంగా హరే రామ నామ సంకీర్తన నిర్వహించబడుతుందని అన్నారు. దేవాలయం కాకతీయుల కాలంలో నిర్వహించిన దేవాలయాన్ని ఇక్కడ ఉన్న హనుమంతుడు కొలిచిన భక్తులకు కొంగుబంగారంగా కోర్కెలు తీరుస్తూ ఉంటాడని ప్రతి మాఘమాసంలో నిర్వహించే ఈ 72 గంటల పాటు నిరంతర హరే రామ నామ సంకీర్తన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ అధ్యక్షులు తూముల వీరస్వామి కోరారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State