ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి

నాగారం 28 నవంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు సామాజిక ఉద్యమకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే కొనియాడిన నాగారం మండలం కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నాతి వెంకన్న గౌడ్ నాగారం మండలం ఫణిగిరి గ్రామంలోని మహాత్మారావు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం మాట్లాడుతూ అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మ స్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే. పూలే విద్య వివక్ష, పేదరికం, ఆర్థిక అసమానత్వం నిర్మూలించడానికి ఎంతో కృషి చేశారు. కుల, మత రహిత సమాజ నిర్మాణానికి ఎనలేని కృషి చేశారు. సమాజం విద్యా పరంగా ఆర్థికంగా ఎదిగినప్పుడే అభివృద్ధి అవుతుందని ఆశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు