సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆన్లైన్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. 

సిబ్బంది కొరతను వెంటనే పెంచాలి. 

Nov 28, 2024 - 18:40
 0  6
సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆన్లైన్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. 
సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆన్లైన్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. 

సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్. 

(సూర్యాపేట టౌన్ నవంబర్ 28 )

సూర్యాపేట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు, అమ్మకాలు మొదలైన పనుల కోసం జరగాల్సిన ఆన్లైన్ సమస్యలు తలెత్తకుండా జరగకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని  కోరారు. నిన్న బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన సంఘం  కార్యాలయం నుండి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిరోజు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు క్రయవిక్రయాలకు విచ్చేస్తున్నటువంటి ప్రజలకు ఆన్లైన్ సౌకర్యంలో ఇబ్బందులు ఏర్పడడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి ఆన్లైన్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ సమస్యలు తలెత్తడంతో కార్యాలయానికి వచ్చేటువంటి ప్రజలు గంటలు తరబడి క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సిబ్బందిని పెంచడంతోపాటు ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించే చర్యలు చేపట్టాలని  పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నెలలో 3 రోజులపాటు సైట్ ప్రాబ్లం ఉండటంవల్ల ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ,అమ్మకాలు, గిఫ్ట్ డిడి, మార్టిగేషన్ కోసం కార్యాలయాలకు వచ్చేటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. జిల్లా కలెక్టర్ తో పాటు రాష్ట్ర ఉన్నత అధికారులు స్పందించి సత్వర చర్యలు చేపట్టి ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా కోశాధికారి పాల సైదులు జిల్లా కార్యదర్శి మండాది గోవర్ధన్ గౌడ్ జిల్లా కార్యదర్శి ప్రెగాపురం నరసయ్య పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి పట్టణ కార్యదర్శి సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్ రాపర్తి జానయ్య బండారి మల్లేష్ యాదవ్ జిల్లా కార్యదర్శి తోట్ల సమ్మయ్య గౌడ్ నిలయ పట్టణ ఉపాధ్యక్షుడు ఖమ్మం పాటి అంజయ్య గౌడ్ తండు సైదులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333