ఎన్నికలు ఏవైనా ఎప్పుడైనా కాంగ్రెస్ దే విజయం

Aug 4, 2024 - 18:59
Aug 4, 2024 - 19:22
 0  102

అడ్డగూడూరు 4 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని లక్ష్మీదేవికాల్వ గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికలు ఏవైనా ఎప్పుడైనా కాంగ్రెస్ దే విజయమని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు.సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను గెలిచిన వెంటనే ఈ ఊరుకు 20 లక్షల సీసీ రోడ్లకు,గట్టుసింగారం రోడ్డుకు మొరం పోయుటకు 3లక్షల 50 వేల నిధులు మంజూరు చేసిన గ్రామ అబివృద్దికి, ప్రజలకు ఆపదలో అందుబాటులో ఉంటానన్నారు.నాఊరు పక్కన ఊరు అబివృద్దికి సహకరిస్తామన్నారు.నేనే గెలవకపోతే బిక్కేరువాగులో ఇసుకంతా లూటీచేసేవారేనని ఈప్రాంతం ఎడారిగా మారేదని పంటలు వేసుకోలేని పరిస్థితి ఏర్పడేదని ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే నన్ను ఆదరించి మీ గ్రామంనుండి మెజారిటీ ఇచ్చినందుకు గ్రామస్తులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.గ్రామ కాంగ్రెస్ కార్యకర్తల విజ్ఞప్తి మేరకు లక్ష్మీదేవికాల్వ నుండి గట్టుసింగారం రోడ్డుకు బీటీ చేయుటకు , సబ్బు గూడం రోడ్డుకు కంకర , మర్లపాయ రోడ్డు పార్మెషన్ , ఎస్సీ కమ్యూనిటీ హాల్ పూర్తి చేయుటకు , స్మశాన వాటిక వరకు సిసి రోడ్డు, గ్రామపంచాయతీ కార్యాలయంకు అదనపు గదులు, గ్రంథాలయ నిర్మాణానికి , చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటు నిర్మాణానికి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ ఆగస్టు15లోపు రెండు లక్షల వరకు పూర్తి కాబోతుందని ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి అని అన్నారు. అనంతరం  ముఖ్యమంత్రి సహాయనిధి  చెక్కులను బాధితులకు నల్లమాద దేవయ్య కుటుంబానితో పాటు చౌల్లరామారం గ్రామానికి చెందిన రాముకు అందజేశారు.

   తదనంతరం గ్రామానికి చెందిన బండి మహంకాళి, పనుమటి పెద్ద రామ నర్సమ్మ ఇటీవల మరణించగా మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి , బాధిత కుటుంబ సభ్యులకు 5వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా విలేకరులు ఈరోజు ప్రెండ్ షిప్ డే ఈ గ్రామంలో మీకు స్నేహితులు ఎవరని అడుగగా నాకు మంచి మిత్రుడు మారోజు మల్లయ్య అని తెలిపారు. తొలుత గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టారు. కాంగ్రెస్ నాయకులు  గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గజమాలతో ఘనంగా సన్మానించి ,ఘనస్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పోలెబోయిన లింగయ్య యాదవ్, సింగిల్ విండో చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి , కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి నిమ్మనగోటి  జోజి, కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు దామెర్ల వీరయ్య , కన్నెబోయిన గంగరాజు , బొమ్మగాని భద్రయ్య, అక్కనపల్లి నర్సయ్య, పొన్నాల భాస్కర్ , మాధ వెంకన్న , అక్కనపల్లి నాగరాజు , పొన్నాల వీరయ్య,పొన్నాల వెంకన్న, కంచుగట్ల వీరభద్రి, ఆకారపు వెంకన్న, నీలగిరి అంతయ్య, దామెర్ల సైదులు, దామెర్ల పిచ్చయ్య, కన్నెబోయిన లింగమల్లు , ఆటో నర్సయ్య , పొన్నాల మహేష్, బాసాని చిరంజీవి, వెల్దేవి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ మంటీపెళ్లి గంగయ్య, మోత్కూర్ మాజీ డైరెక్టర్ బోడ యాదగిరి, బొమ్మగాని రమేష్, అక్కనపల్లి సతీష్,నీలగిరి శ్రీను,బండి మధు ,బండి యాదయ్య, నల్లమాద సతీష్,  తదితరులు పాల్గొన్నారు.