గ్రామాల్లో సమస్యలను పరిష్కరించే వారికి జేఏసీ మద్దతు .చైర్మన్ భూపతి రాములు

Oct 5, 2025 - 17:30
 0  33
గ్రామాల్లో సమస్యలను పరిష్కరించే వారికి జేఏసీ మద్దతు .చైర్మన్ భూపతి రాములు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ గ్రామాల్లో సమస్యలను పరిష్కరించే వారికి జేఏసీ మద్దతు ఆత్మకూర్ ఎస్... గ్రామాల్లో మౌళిక వసతులు కల్పించి ప్రజా సంక్షేమo కోసం కట్టుబడే వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో జేఏసీ మద్దతు ఉంటుందని సామాజిక జేఏసీ మండల జేఏసీ చైర్మన్ భూపతి రాములు తెలిపారు. ఆదివారం నెమ్మికల్ sv ఫంక్షన్ హాల్ లో జరిగిన మండల జేఏసీ ముఖ్య కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రజా ప్రతినిధులు రాజకీయాల పేరుతో పార్టీలు వారి ఆస్తులు తప్ప ప్రజల ను పట్టించుకొనే వారు లేకుండా పోయారని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల అభివృద్ధి ప్రజా సంక్షేమం, మౌళిక వసతుల కల్పన కోసం కట్టుబడే వారు ఏ పార్టీ వారైనా జేఏసీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. త్వరలో గ్రామాల్లో నెలకొన్న సమస్య ల సాధనకు జేఏసీ అఖిల పక్షాల, యువజన మహిళా సంఘాల మద్దతు తో పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. అవసరం అయిన చోటు ఎన్నికల పోటీకి దిగుతుందని తెలిపారు. ప్రజల కు సేవ చేయాలన్న దృక్పథం ఉన్న వారు జేఏసీ మద్దతు గా కలిసి రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు దొంతగాని కర్ణాకర్, గంపల కృపాకర్, నల్లగొండ నాగయ్య, నాయిని నాగరాజు, గుండు రమేష్ తదితరులు పాల్గొన్నారు.