MLC ఎన్నికల విధులు, బందోబస్తు నిర్వహణపై పోలీసు సిబ్బందికి సూచనలు చేసిన

జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే

May 26, 2024 - 21:06
May 26, 2024 - 21:21
 0  12
MLC ఎన్నికల విధులు, బందోబస్తు నిర్వహణపై పోలీసు సిబ్బందికి సూచనలు చేసిన
MLC ఎన్నికల విధులు, బందోబస్తు నిర్వహణపై పోలీసు సిబ్బందికి సూచనలు చేసిన
MLC ఎన్నికల విధులు, బందోబస్తు నిర్వహణపై పోలీసు సిబ్బందికి సూచనలు చేసిన

హైదరాబాద్ 26 మే 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- 27వ తేదీన జరగనున్న పట్టభద్రుల MLC ఎన్నికల నిర్వహణకు పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఐపిఎస్ గారు తెలిపినారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం, కలక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన రిషప్షన్ సెంటర్ నందు పోలీసు సిబ్బందికి బందోబస్తు ప్రణాళిక, విధులు నిర్వహణలో అనుసరించాల్సిన విధివిధానాలపై దిశా నిర్దేశం చేసి సలహాలు సూచనలు ఇచ్చారు.

ఎన్నికల సామాగ్రి తరలించడం, వాటికి రక్షణ కల్పించడం ప్రాథమిక విధి, మార్గం లో అన్ని స్థితిగతులు పరిశీలించాలి, ఇబ్బందులు వస్తే అధికారులకు, స్ట్రైకింగ్ ఫోర్స్ అధికారులకు సమాచార ఇవ్వాలి అన్నారు. పోలింగ్ బూత్ ను, మొబైల్ రూట్ వాహనాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలివెళ్లవద్దు అన్నారు. ఓటర్లను క్యూ లైనులో ఉంచాలని అన్నారు, పోలీసులు పోలింగ్ బూత్ అధికారి అనుమతి లేకుండా బూత్ లోకి వెళ్ళవద్దు అని సూచించారు. ఇతరులను పోలింగ్ బూత్ లోకి అనుమతించద్దు. ఓటర్లతో మర్యాదగా మాట్లాడాలని అన్నారు.

ఎస్పి గారి వెంట అదనపు ఎస్పీ నాగేశ్వర రావు, DSP రవి స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు, ఎలక్షన్ సెల్ ఇన్స్పెక్టర్ పాండరి, CI రాజశేఖర్ ఉన్నారు.

- ఏంఎల్సి ఎన్నికలకు పటిష్ట భద్రత.
- బందోబస్తు కి 500 మంది పోలీసులు.
- 144 సెక్షన్ అమలులో ఉన్నది.
- ఓటరు కానీవారు పోలింగ్ కేంద్రంవద్ద అనుమతి లేదు.
- పోలింగ్ కేంద్రం వద్ద 100 మీటర్ల పరిధి ఆంక్షలు ఉంటాయి.
-..... రాహుల్ హెగ్డే ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.

జిల్లాలో 71 పోలింగ్ కేంద్రాల్లో MLC ఎన్నికల పోలింగ్ జరుగుతుందనీ పోలింగ్ కు సంభందించి 500 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు అని జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఐపిఎస్ గారు తెలిపినారు. ఆయుధ పహారాలో పోలింగ్ సామాగ్రిని తరలించడం జరుగుతుంది అన్నారు. 16 రూట్స్ లలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటారు. 28 స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్, 8 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేశాం అన్నారు. CC కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుంది అన్నారు.

 పౌరులు, ఓటర్లు నియమ నిబంధనలు పాటించాలి అని ఎస్పి కోరారు. ఓటరు గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలి, క్యూ లైనులో నిల్చొని ఓటు వెయ్యాలి. ఎన్నికల సిబ్బందికి ప్రతిఒక్కరూ సహకరించాలి. ఎవరూ తగాదాలు పెట్టుకోవద్దు, ప్రచారం చేయవద్దు, సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు పోలింగ్ బూత్ లోకి అనుమతి లేదు అని గ్రహించాలి అన్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్నది, 5 గురు మించి గుంపులుగా చెరవద్దు, పోలింగ్ బూత్ వద్ద 100 మీటర్ల పరిధి ఆంక్షలు ఉంటాయి. ప్రతిఒక్కరూ బాధ్యతగా ఓటు వెయ్యాలి అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333