బిజెపి దృష్టి కోణం, ఒకే దేశం, ఒకే ఎన్నిక - చల్ల శ్రీలతరెడ్డి

Mar 18, 2025 - 19:00
 0  10
బిజెపి దృష్టి కోణం, ఒకే దేశం, ఒకే ఎన్నిక - చల్ల శ్రీలతరెడ్డి

సూర్యాపేట జిల్లా కేంద్రంగా RRR ఫంక్షన్ హాల్ నందు ఒకే దేశం - ఒకే ఎన్నిన సమావేశాన్ని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా శ్రీలతరెడ్డి గారు మాట్లాడుతూ లోక్‌సభ మరియు రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు ఒకేసారి, ఒకే రోజున లేదా సరైన సమయంలో జరగడం వల్ల ఎన్నికల ప్రక్రియను క్రమబద్ధీకరించడం, ఎన్నికల తరచుదనాన్ని తగ్గించడం మరియు సమయం మరియు వనరులను ఆదా చేసుకోవచ్చని అన్నారు. అదేవిదంగా ఒకే దేశం - ఒకే ఎన్నికలు నినాదంతో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు కేంద్రం సిద్ధపడుతోందని, రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్ సభకు వేర్వేరుగా ఎన్నికలు జరగడం వల్ల దేశంలో ఎప్పుడూ ఏదో ఒక ఎన్నికలు జరుగుతున్నాయని ఆ విదానాన్ని మార్చి దేశ ప్రగతిపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నది కేంద్రం అని ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల అభివృద్ధి మరింత వేగం అవుతుందని అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో సీనియర్ నాయకులు, ఒకే దేశం, ఒకే ఎన్నిక జిల్లా, మండల కో-ఆర్డినేటర్లు, కన్వీనర్లు, కో-కన్వీనర్లు, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333