గౌతంపూర్ లో సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిపై అవగాహన. 

Jun 28, 2024 - 20:29
Jun 28, 2024 - 20:44
 0  8
గౌతంపూర్ లో సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిపై అవగాహన. 
గౌతంపూర్ లో సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిపై అవగాహన. 

పంచాయతీ సెక్రటరీ జ్యోతి ఆధ్వర్యంలో కార్యక్రమం

చుంచుపల్లి 28 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఐఏఎస్ ఆదేశానుసారం గౌతమ్ పూర్ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఎంపీ ఓ సత్యనారాయణ సూచనలతో  గౌతమ్ పూర్ పంచాయతీ  సెక్రటరీ జ్యోతి ఆధ్వర్యంలో సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిపై అవగాహన  కార్యక్రమం గ్రామ సభ ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సెక్రటరీ  మాట్లాడుతూ సికిల్ సెల్ ఎనీమియా అనే వ్యాధి మన శరీరంలోని హిమోగ్లోబిన్ పై ప్రభావితాన్ని చూపిస్తుందని దాని ద్వారా హిమోగ్లోబిన్ తగ్గిపోయి రక్తహీనత వచ్చి మనిషి నీరసంగా,వ్యాధి నిరోధకత లేకుండా ,అనేక జబ్బుల బారిన పడతాడని అనగా గుండె నొప్పి, పక్షవాతం, పుపూస రక్త పోటు, అందత్వం, పిత్తాశయ రాళ్లు, గర్భధారణ సమస్యలు, అవయవ నష్టం తదితర వ్యాధులు రావచ్చని తెలియజేశారు.

 అందరూ సికిల్ సెల్ ఎనీమియా పరీక్షలు చేయించుకోవాలని దాని కొరకై వైద్య ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉందని ప్రజలందరికీ అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రగతి గ్రామ సమాఖ్య వివో ఏ పద్మ డ్వాక్రా మహిళలు ఏఎన్ఎం విజయ కుమారి కౌసల్య కాంతామని ఆశాలు నిర్మల సరోజ సరిత వెంకటలక్ష్మి ఫీల్డ్ అసిస్టెంట్ కేస్లీ పంచాయతీ గుమస్తా శివ  గ్రామ పెద్దలు రవీందర్ వివో ఏ జాల విజయ ఈశ్వరి  తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333